|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాకాస విధ్వంసం: నిహారిక మూవీకి ఊహించని రెస్పాన్స్! బాక్సాఫీస్ బద్దలు.. కలెక్షన్ల సునామీ!

Published: 13-04-2026, 12:35 PM
రాకాస విధ్వంసం: నిహారిక మూవీకి ఊహించని రెస్పాన్స్! బాక్సాఫీస్ బద్దలు.. కలెక్షన్ల సునామీ!
  • నిహారిక కొణిదెల నిర్మాణంలో రాకాస మూవీకి ఊహించని రెస్పాన్స్, కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
  • సంగీత్ శోభన్, నయన్ సారిక నటనకు ప్రశంసలు, రాకాస మూవీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.
  • కేవలం 10 రోజుల్లో రాకాస వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.
  • రాకాస టికెట్ ధర తగ్గింపుతో మరింత ఆదరణ, ఫ్యామిలీ ఆడియన్స్‌తో థియేటర్లు నిండిపోతున్నాయి.

నిహారిక కొణిదెల నిర్మాణంలో వచ్చిన ‘రాకాస’ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ హారర్ కామెడీ ఫాంటసీ మూవీకి ప్రేక్షకుల నుండి భారీ స్పందన వస్తోంది. కలెక్షన్ల పరంగా రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతోంది.

రాకాస మూవీకి ప్రేక్షకుల బ్రహ్మాండమైన స్పందన!

Raakaasa 10 Days Worldwide Box Office Collections: నిహారిక కొణిదెల నిర్మించిన లేటెస్ట్ హారర్ కామెడీ ఫాంటసీ మూవీ రాకాస. సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను ఆడియెన్స్ మళ్లీ మళ్లీ చూస్తున్నారని మేకర్స్ తెలిపారు. ఈ క్రమంలో రాకాస 10 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో చూద్దాం.

Raakaasa Worldwide Box Office Collections: టాలీవుడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్ , హీరోయిన్ నయన్ సారిక జంటగా నటించిన లేటెస్ట్ మూవీ రాకాస. నిహారిక కొణిదెల నిర్మించిన హారర్ కామెడీ ఫాంటసీ మూవీ రాకాసకు మానస శర్మ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది.

ఈ విజ‌యానికి ప్రధాన కారణం థియేటర్లలో ప్రేక్షకుల నుంచి వ‌స్తోన్న స్పంద‌న‌. రాకాస‌ సినిమాను ప్రేక్ష‌కులు వారి కుటుంబంతో క‌లిసి వ‌చ్చి వీక్షించి స‌ర‌దాగా న‌వ్వుకుని ఆస్వాదిస్తున్నారు. ఈ రెస్పాన్స్ ప్రతి షోలో కనిపిస్తోంది. ఈ రెస్పాన్స్ కొన‌సాగుతుండ‌టంతో సినిమాకు ఓ థియేట‌ర్స్‌లో స్థిరమైన రన్ కొనసాగుతోంది.

10 రోజుల్లో రాకాస కలెక్షన్ల మోత.. రికార్డులు బ్రేక్!

రాకాస సినిమా అందరికీ సులభంగా అర్థమయ్యేలా వినోదాత్మక చిత్రంగా రూపొందింది. దీంతో అన్ని వయసుల వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా అన్నీ వ‌ర్గాల వారికి న‌చ్చ‌టంతో రాకాస మూవీ బ్యాలెన్స్‌డ్‌గా మంచి ఆద‌ర‌ణ‌తో చ‌క్క‌టి క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తోంది.

ఇందులో చిన్న పిల్ల‌ల‌కు కావ‌ల్సిన స‌ర‌దా, ఊహాశక్తిని రేకెత్తించే సన్నివేశాలు ఉండ‌టంతో వారు ఆక‌ర్షితుల‌వుతున్నారు. అలాగే మిగిలిన ఆడియెన్స్‌కు కావాల్సిన కామెడీ, పాత్ర‌ల ఆధారంగా న‌డిచే ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశాలు అన్నీ క‌ల‌గ‌లిసి ఉండ‌టంతో ప్రేక్ష‌కుల‌కు ఇదొక మంచి ఎంపిక‌గా మారుతోంది.

రాకాస సినిమా స్థిరమైన రన్‌ను కొనసాగిస్తోన్న త‌రుణంలో మేక‌ర్స్ ఏప్రిల్ 10 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100 ఫ్లాట్ టికెట్ ధరను ప్రవేశపెట్టారు. దీంతో సినిమా ప్రస్తుతం పొందుతున్న ప్రేక్షకుల ఆద‌ర‌ణ మ‌రింత పెరిగింది.

ఫ్యామిలీ ఆడియన్స్‌తో థియేటర్లు కళకళ.. రాకాస హవా!

టికెట్ ధ‌ర ప్రేక్ష‌కుల అందుబాటులోకి రావ‌టం ఎంతో కీల‌క‌మ‌ని చెప్పొచ్చు. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పటికీ ఎక్కువ వసూళ్లను సాధిస్తున్నాయి. ఇప్పటికే సినిమాతో కనెక్ట్ అయిన కుటుంబాలు మళ్లీ మళ్లీ రావడానికి కూడా ఇది ప్రోత్సాహకంగా ఉంది.

అంద‌రినీ మెప్ప్పిస్తూ రాకాస సినిమా రన్ కొనసాగుతుంది. దీంతో థియేట‌ర్స్‌కు ఆడియెన్స్ రావ‌టానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి తోడు డిఫ‌రెట్ ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీ, మౌత్ టాక్ కూడా తోడు కావ‌టం మంచి ప‌రిణామం. ప్రస్తుతం ఉన్న ఈ వేగం అలాగే కొనసాగుతూ, టికెట్ ధరలు కూడా అందుబాటులోకి రావడంతో, ఈ సినిమా వేసవి కాలం మొత్తం మంచి రన్ కొనసాగించే స్థితిలో ఉంది.

రాకాస సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఈ మూవీ మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని అంచనా.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.