|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాకాస ఓటీటీ ఎంట్రీ: సౌత్ ఇండియాకు ఊహించని షాక్! నెట్‌ఫ్లిక్స్‌లో మల్టీ-లాంగ్వేజ్ ధమాకా!

Published: 01-05-2026, 5:26 PM
రాకాస ఓటీటీ ఎంట్రీ: సౌత్ ఇండియాకు ఊహించని షాక్! నెట్‌ఫ్లిక్స్‌లో మల్టీ-లాంగ్వేజ్ ధమాకా!
  • ‘రాకాస’ చిత్రం మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
  • తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
  • నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు.
  • సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించారు.

థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ‘రాకాస’ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, సౌత్ ఇండియా ప్రేక్షకులకు ఊహించని సర్ప్రైజ్ ఇస్తూ తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది.

రాకాస ఓటీటీ విడుదల: సౌత్ ఇండియాకు స్పెషల్ ట్రీట్

Raakasa Movie: థియేటర్లలో వచ్చిన ప్రతి సినిమా కూడా ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చి ఓటీటీ ప్రియులను అలరిస్తున్న విషయం తెలిసిందే .అలా 2026 ఏప్రిల్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాకాస మూవీ నేడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా థియేటర్లలో తెలుగులో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం ఓటీటీలో ఏకంగా సౌత్ ఇండియా ఆడియన్స్ కి స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ ప్రేక్షకుల ముందుకు రావడంతో ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతల ఆలోచన తీరుకి ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి నిహారిక రాకాస మూవీ ఓటీటీలో ఆడియన్స్ కు ఎలాంటి సర్ప్రైజ్ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం.

అసలు విషయంలోకి వెళ్తే.. సంగీత్ శోభన్ , నయన్ సారిక జంటగా వచ్చిన రాకాస మూవీ థియేటర్లలో కేవలం తెలుగులో మాత్రమే ఏప్రిల్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాంటి ఈ సినిమా నేడు (మే 1) ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా తెలుగుతోపాటు దక్షిణాది భాషలైన తమిళ్, మలయాళం , కన్నడ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక మొత్తానికైతే ఓటీటీ వెర్షన్ ఏకంగా నాలుగు భాషల్లో అందుబాటులోకి రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా విడుదల చేయడం వల్ల వివిధ ప్రాంతాలలోని విస్తృత ప్రేక్షక వర్గానికి ఈ సినిమా చేరువ అవుతుంది అని చెప్పవచ్చు..

సినిమా విశేషాలు: నటీనటులు, దర్శకుడు, నిర్మాణం

రాకాస సినిమా విషయానికి వస్తే.. అనుదీప్ దేవ్ అందించిన సంగీతం సినిమాకు ఫుల్ ఎనర్జీని అందించింది. ఉమేష్ కుమార్ గుప్త సహనిర్మాతగా వ్యవహరించిన ఈ ప్రాజెక్టును నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించింది. లేడీ డైరెక్టర్ మానస శర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి టాక్ తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో బ్రహ్మాజీ, తణికెళ్ళ భరణి, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ లాంటి దిగ్గజ హాస్యనటులు సినిమాకు మరింత ప్లస్గా మారారు. కథకు లోతును, హాస్యాన్ని జోడించి , ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచారు. మరి ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

కథాంశం: వీరు, సుకన్య ప్రేమకథ

అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇండియాలో తాను ప్రేమించిన సుకన్య అనే అమ్మాయిని వివాహం చేసుకోవాలని సొంతూరుకి వస్తాడు వీరు( సంగీత్ శోభన్). అయితే అప్పటికే సుకన్య పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతుంది. బ్రేకప్ బాధలో ఉన్న వీరు.. అదే సమయంలో సోము (వెన్నెల కిషోర్) అనే వ్యక్తిని హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అతని పాస్ పోర్ట్ ను పోలీసులు తీసుకెళ్లిపోతారు. సోము జాడను కనిపెడితే తన పాస్ పోర్ట్ తిరిగి వస్తుందని స్నేహితుడు బాలు (గెటప్ శ్రీను)తో కలసి సోముని వెతికే ప్రయత్నం చేస్తాడు.. అదే సమయంలో ఆ ఊరి చివరిలో ఎన్నో దశాబ్దాలుగా ఉన్న బ్రహ్మ రాక్షసుడికి నరబలి ఇవ్వాల్సిన సమయం వస్తుంది . దీంతో ఆ ఊరంతా కలిసి ఒక ముసలివాడిని బలివ్వడానికి సిద్ధమవుతారు. అయితే చివరి క్షణంలో అతడు చనిపోతాడు. దాంతో అతడికి బదులుగా బాలు వెళ్లాల్సి వస్తుంది. ఇక వీరు దానికి అడ్డుపడతాడు.. దీంతో బాలుకి బదులుగా వీరు ఆ కోటలోకి ప్రవేశిస్తాడు? ఆ తర్వాత ఏమైంది? ఆ కోట ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి? నిజంగానే బ్రహ్మ రాక్షసుడు అక్కడ ఉన్నాడా ?ఈ ప్రయాణంలో హీరోయిన్తో పరిచయం ఎలా ఏర్పడింది? ఆమె ఎందుకు ఈ కోటలోకి వెళ్ళింది? సోము సంగతి ఏంటి ? ఇలా పలు ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

‘రాకాస’ సినిమా బహుభాషల్లో ఓటీటీ విడుదల కావడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిహారిక కొణిదెల నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం, విస్తృత ప్రేక్షకులకు చేరువవుతుందని నిర్మాతలు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.