|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉస్తాద్ భగత్ సింగ్: పవన్ కళ్యాణ్ గురించి రాశి ఖన్నా షాకింగ్ కామెంట్స్! ఫాన్స్ కి పూనకాలే!!

Published: 17-03-2026, 8:05 AM
ఉస్తాద్ భగత్ సింగ్: పవన్ కళ్యాణ్ గురించి రాశి ఖన్నా షాకింగ్ కామెంట్స్! ఫాన్స్ కి పూనకాలే!!
  • పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న థియేటర్లలో విడుదల!
  • పవన్ కళ్యాణ్ నుండి మానవత్వం నేర్చుకున్నా: రాశి ఖన్నా.
  • హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ మాస్ అవతార్ అదుర్స్!
  • అక్షయ్ కుమార్‌తో రాశి ఖన్నా బాలీవుడ్ ఎంట్రీ అదిరింది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రాశి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఆమె పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపింది.

పవన్ కళ్యాణ్ తో సినిమా ఒక కల!

పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న థియేటర్స్‌లోకి అడుగుపెట్టనుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా విశేషాలు పంచుకుంది రాశీ ఖన్నా. ‘నిజం చెప్పాలంటే, పవన్ కల్యాణ్ గారి సినిమా అనగానే కథ కూడా వినకుండా ఎంతో ఉత్సాహంతో ఓకే చెప్పేశా. నేను నా మొదటి సినిమా చేస్తున్నప్పటి నుంచే ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలి అనుకున్నాను. ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో నా కల నెరవేరింది. ఈ సినిమాలో నా పాత్ర చాలా మోడ్రన్‌గా ఉంటుంది. నా పాత్రకు మంచి క్యారెక్టరైజేషన్ ఉంటుంది. నాకు ఇందులో ఒక మాస్ సాంగ్ ఉంది.

నాకు డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి, ఆ సాంగ్ షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాను. పవన్ చాలా సింపుల్ పర్సన్, ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ కనిపిస్తారు. ఆయనలో ఒక తెలియని అమాయకత్వం ఉంది. తక్కువ మాట్లాడతారు.. కానీ, ప్రతి మాటలో విలువ ఉంటుంది. నాతో ప్రజా సేవ చేయమని చెప్పారు. పవన్ ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు. ఆయన నుంచి మానవత్వం నేర్చుకున్నాను. ఉస్తాద్ వేడుకలో స్టేజ్ మీద నుంచి పవన్ అభిమానులను చూస్తుంటే, ఆయనను ఒక దేవుడిలా ఆరాధిస్తున్నట్లు అనిపించింది’ అంటూ మరెన్నో విశేషాలు పంచుకుంది. ఇక ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్‌తో ఒక సినిమా, ‘ఫర్జీ 2’ షో చేస్తున్నాను. అమెజాన్‌ సిరీస్‌లో ఒక పంజాబీ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను, అందులో నా డైలాగ్స్ అన్నీ పంజాబీలోనే ఉంటాయి. తమిళ్ లో ‘రౌడీ అండ్ కో’ చేస్తున్నాను. తెలుగులో కూడా కొన్ని కథలు వింటున్నానని తెలిపారు.

ఉస్తాద్ లో రాశి ఖన్నా మాస్ సాంగ్ అదుర్స్!

పవన్ నుండి మానవత్వం నేర్చుకున్నా!

రాశి ఖన్నా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కోసం వేచి చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.