
📌 Key Points
- రాశీ ఖన్నా: ‘సినిమాలంటే ఇష్టం లేదు, కానీ ఊహలు గుసగుసలాడేతో నా జీవితం మారింది!’
- పవన్ కళ్యాణ్ సరసన రాశీ.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో మెరుపులాంటి నటన!
- తెలుసు కదా మూవీలో సిద్ధుతో రాశి జోడీకి థియేటర్లలో సూపర్ రెస్పాన్స్!
- సోషల్ మీడియాలో రాశి సందడి.. అభిమానులతో నిత్యం టచ్‌లో ఉండే బ్యూటీ!
యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా సంచలన విషయాలు వెల్లడించింది. తనకు సినిమాలంటే అస్సలు ఇష్టం లేదని చెప్పడం హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్న ఈ బ్యూటీ మరిన్ని విషయాలు పంచుకుంది. చూద్దాం!
సినిమాలపై ఇంట్రెస్ట్ లేదన్న రాశి ఖన్నా
యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇటీవల ఈ చిన్నది స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ సరసన తెలుసు కదామూవీలో నటించి మెప్పించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఓకే ఓకే అనిపించుకున్నప్పటికీ ఈ భామ యాక్టింగ్‌కు మాత్రం ఫుల్ మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తోంది. దీనికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
అయితే ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. “నేను సినిమాలు చూస్తూ పెరగలేదు. ‘మద్రాస్ కేఫ్’ తర్వాత మంచి సినిమాలు రాకపోతే వేరే ఏదైనా పని చేసుకుందాం అనుకున్నాను.
పవన్ కళ్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో రాశి
కానీ తెలుగులో మొదటి సినిమా (ఊహలు గుసగుసలాడే)తో లభించిన గుర్తింపు నన్ను నన్ను ఇక్కడే ఉంచేసింది. అంతా నా డెస్టినీ. అయితే చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి అవకాశాలు త్వరగా రావచ్చు కానీ, ప్రతిభ ఉంటేనే నిలదొక్కుకుంటారు. బయటి నుండి వచ్చిన వారు కొంచెం ఎక్కువ కష్టపడాలి. నేను రిజెక్షన్లను చూసి ఎప్పుడూ విక్టిమ్‌లా ఫీలవ్వలేదు. మన తలరాతలో ఉన్నది ఎవరూ తీసుకోలేరు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తెలుగులో రాశికి ఊహలు గుసగుసలాడేతో గుర్తింపు
A post shared by Raashii Khanna (@raashiikhanna)
రాశీ ఖన్నా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం ఎదురుచూద్దాం. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


