|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి సినిమాలో హీరోయిన్‌కు షాకింగ్ అవమానం! మెగాస్టార్ మూవీ సెట్‌లో అసభ్యంగా ప్రవర్తించారా?

Published: 14-04-2026, 10:35 PM
చిరంజీవి సినిమాలో హీరోయిన్‌కు షాకింగ్ అవమానం! మెగాస్టార్ మూవీ సెట్‌లో అసభ్యంగా ప్రవర్తించారా?
  • చిరంజీవి సినిమా సెట్‌లో రాధికకు అవమానం: అసభ్యంగా ప్రవర్తించిన మోహన్ బాబు!
  • దర్శకుడు కోదండ రామిరెడ్డి, నిర్మాత క్రాంతి కుమార్ దిగ్భ్రాంతి!
  • తెలుగులో రాధికకు మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మించి తీసుకొచ్చిన క్రాంతి కుమార్!
  • వెంటనే కెమెరా ఆపివేసిన నిర్మాత క్రాంతి కుమార్, కో డైరెక్టర్లపై సీరియస్!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఒక సంచలన సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాధికకు జరిగిన అవమానం, మోహన్ బాబు ప్రవర్తనపై ఇండస్ట్రీలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

కిరాయి రౌడీలు సెట్‌లో అసలేం జరిగింది?

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ బిగినింగ్ లో నిర్మాత క్రాంతి కుమార్ తో ఎక్కువగా సినిమాలు చేశారు. క్రాంతి కుమార్ నిర్మాతగా చిరంజీవి, మోహన్ బాబు, రాధిక ప్రధాన పాత్రల్లో 1981లో కిరాయి రౌడీలు అనే చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి కోదండ రామిరెడ్డి దర్శకుడు.

తలకోన ఫారెస్ట్ ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు హీరోయిన్ రాధికకి ఘోర అవమానం ఎదురైంది. మోహన్ బాబు, రాధిక మధ్య జరిగిన అత్యాచారం సీన్ గురించి రచయిత, దర్శకుడు కానగల జయకుమార్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాధికని అత్యాచారం చేసే సీన్ అది. స్క్రిప్ట్ లో ఆ సీన్ అంత వల్గర్ గా లేదు. చాలా జాగ్రత్తగా చేయాలి అని, హీరోయిన్ కి ఎలాంటి అసౌకర్యం ఉండకూడదు అని క్రాంతి కుమార్ సూచించారు.

రాధికకు జరిగిన అవమానం వెనుక కారణాలివే!

కానీ మోహన్ బాబు సీన్ చేసే క్రమంలో రాధిక కట్టుకున్న శారీ జారిపోయి మోహన్ బాబు చేతుల్లోకి వచ్చేసింది. అందరిముందు ఇలా జరగడంతో అవమానంతో ఆమె అక్కడే కుప్ప కూలారు. దీనితో నిర్మాత క్రాంతి కుమార్ వెంటనే కెమెరా స్విచ్ ఆఫ్ చేసి కట్ అని గట్టిగా అరిచేశారు. ఆ తర్వాత రాధిక ఏడుస్తూ పక్కకి వెళ్లిపోయారు. క్రాంతి కుమార్ మా కో డైరెక్టర్స్ అందరిపై సీరియస్ అయ్యారు. మోహన్ బాబు ఏంటి అలా చేస్తున్నారు.. మీకు సీన్ సరిగ్గా వివరించడం రాదా అని తిట్టేశారు.

క్రాంతి కుమార్ వెళ్ళిపోయాక.. ఏంటి అంతలా అరుస్తున్నాడు ఏదో కొంపలు మునిగిపోయినట్లు అని మోహన్ బాబు అన్నారు. పొరపాటున జారిపోయింది. దానికి ఇంత గొడవ చేయాలా అని అన్నారు. రాధిక అప్పట్లో తమిళ సినిమాలు చేసేవారు. తెలుగులో కూడా నటిస్తే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి ఒప్పించి క్రాంతి కుమార్ ఆమెని టాలీవుడ్ కి తీసుకువచ్చారు.

నిర్మాత క్రాంతి కుమార్ సీరియస్ యాక్షన్!

రాధిక క్రాంతి కుమార్ ని నమ్మి వచ్చింది. కాబట్టి ఆమె బాధ్యత క్రాంతి కుమార్ గారిదే. అందుకే ఆమెకి అవమానం జరిగేసరికి ఆయన సీరియస్ అయ్యారు అంటూ జయకుమార్ తెలిపారు.

ఈ ఘటన టాలీవుడ్ లో సంచలనం రేపుతోంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు త్వరలో మీ ముందుకు తీసుకువస్తాం. అప్పటివరకు వేచి ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.