|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కిరణ్ అబ్బవరం పెళ్లిపై రహస్య గోరఖ్ సంచలన వ్యాఖ్యలు! పక్కా ఊరి వ్యక్తితో నా వివాహం వెనుక అసలు నిజం!

Published: 14-04-2026, 11:05 PM
కిరణ్ అబ్బవరం పెళ్లిపై రహస్య గోరఖ్ సంచలన వ్యాఖ్యలు! పక్కా ఊరి వ్యక్తితో నా వివాహం వెనుక అసలు నిజం!
  • కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ ప్రేమ వివాహం చేసుకున్నారు.
  • రాజావారు రాణిగారు సినిమాతో వీరిద్దరూ వెండితెరకు పరిచయమయ్యారు.
  • పెళ్లి తర్వాత రహస్య సినిమాలకు దూరంగా ఉన్నారు.
  • తిమ్మరాజు పల్లి టీవీ సినిమా ప్రమోషన్లో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు రహస్య.

నటి రహస్య గోరఖ్, కిరణ్ అబ్బవరంల వివాహం గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను పక్కా ఊరి వ్యక్తిని వివాహం చేసుకున్నానని, పల్లె వాతావరణం గురించి ఆమె మాట్లాడారు. ‘తిమ్మరాజు పల్లి టీవీ’ సినిమా ప్రమోషన్లో ఆమె ఈ విషయాలు తెలిపారు.

రహస్య గోరఖ్ సినీ ప్రస్థానం, వివాహం

Rahasya Gorak: రహస్య గోరక్ పరిచయం అవసరం లేని పేరు . నటిగా పలు సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఈమె నటుడు కిరణ్ అబ్బవరాన్ని(Kiran Abbavaram) పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉంటూ గత రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. వీరిద్దరూ మొట్టమొదటిసారి రాజావారు రాణి గారు అనే సినిమా ద్వారా వెండితెరకు హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ప్రేమలో పడిన వీరిద్దరూ ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే.

పెళ్లి తర్వాత రహస్య(Rahasya) సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తెరు వెనుక ఉంటూ సినిమా బాధ్యతలను తీసుకుంటున్నారు. కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే .ఈ నేపథ్యంలోనే నిర్మాణ పనులకు సంబంధించిన బాధ్యతలను రహస్య చూసుకుంటున్నారు. కిరణ్ ఇటీవల కాలంలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఇక ఈయన నిర్మాతగా మారి తిమ్మరాజు పల్లి టీవీ (Timmaraju Palli Tv)అనే సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఏప్రిల్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

కిరణ్ అబ్బవరం నిర్మాతగా కొత్త సినిమా

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నేడు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఇందులో భాగంగా కిరణ్ అబ్బవరంతోపాటు రహస్య కూడా పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో రహస్య మాట్లాడుతూ.. తాను హైదరాబాదులోనే పుట్టి పెరిగాను అయితే పెళ్లి మాత్రం పక్క ఊరోడిని పెళ్లి చేసుకున్నాను అంటూ కిరణ్ అబ్బవరంతో పెళ్లి గురించి మాట్లాడారు. తాను హైదరాబాదులో పుట్టి పెరిగినప్పటికీ పల్లె వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ జీవన విధానాలు ఎలా ఉంటాయని నాకు తనని పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసిందని అయితే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పటి జనరేషన్ పిల్లలు మిస్ అవుతున్నారని రహస్య తెలిపారు.

పాత జ్ఞాపకాలను గుర్తు చేసేలా తిమ్మరాజు పల్లి టీవీ..

ప్రీ రిలీజ్ వేడుకలో రహస్య కామెంట్స్

ఇలా పల్లెటూరి జ్ఞాపకాలను మిస్ అవుతున్న వారందరూ కూడా తప్పకుండా మా తిమ్మరాజు పల్లి టీవీ సినిమాకు రండి కచ్చితంగా మీకు ఆ అనుభవాన్ని కలిగిస్తుందని, 90 లలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా చూస్తూ వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారని కచ్చితంగా మీ అందరికీ మా సినిమా నచ్చుతుంది అంటూ రహస్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా ఒక పల్లెటూరిలో ఒకే ఇంట్లో టీవీ ఉంటే గ్రామస్తులు అందరూ అక్కడికి వెళ్లి కలిసికట్టుగా సినిమా చూడటం, టీవీ కారణంగా రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవలు వంటి నేపథ్యంలోనే సినిమా ఉండబోతుందని ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. ఇక ఈ సినిమా ద్వారా పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకు రావడం పక్కా అంటూ ట్రైలర్ తోనే చూపించారు. మరి ఏప్రిల్ 17న రాబోతున్న తిమ్మరాజు పల్లి టీవీ సినిమా నిర్మాతగా కిరణ్ అబ్బవరంకు ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది తెలియాల్సి ఉంది.

మొత్తానికి రహస్య గోరఖ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘తిమ్మరాజు పల్లి టీవీ’ సినిమా ద్వారా పల్లెటూరి అనుభూతిని పొందాలని ఆమె కోరారు. ఈ సినిమా 90ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని తెలిపారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.