
📌 Key Points
- రాజాసాబ్‌లో ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఫైట్ సీన్స్ అదుర్స్, థియేటర్లలో రచ్చ!
- నెగెటివ్ టాక్ తెచ్చుకున్న రాజాసాబ్‌కు ఊపిరిలూదిన సరికొత్త సన్నివేశాలు!
- ఆదివారం నుండి థియేటర్లలో న్యూ వెర్షన్ రాజాసాబ్, ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
- మారుతి దర్శకత్వంలో ప్రభాస్ మాస్ అవతార్, అప్సైడ్ డౌన్ ఫైట్ హైలైట్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. నెగెటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ వెంటనే స్పందించింది. అభిమానుల కోసం అదిరిపోయే అప్డేట్తో మీ ముందుకు వచ్చింది.
నెగెటివ్ టాక్‌తో రాజాసాబ్ కలెక్షన్లు డౌన్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన `ది రాజాసాబ్`(The Raja Saab) థియేటర్లలో రిలీజ్ అయి నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా వాటిని అందుకోవడంలో విఫలమవ్వడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సినిమాకు నెగిటివ్ రివ్యూలు.. థియేటర్ల వద్ద పబ్లిక్ టాక్‌తో ఫస్ట్ షో నుంచే నెగెటివ్ తెచ్చుకుంది. అయితే డైరెక్టర్ మారుతి ఎంతో కాన్పిడెంట్‌గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది.. అవ్వకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ మా ఇంటికి వచ్చి అడగవచ్చు అని ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పిన సంగతి తెలిసిందే.
ఫ్యాన్స్ కోరిక మేరకు సీన్స్ యాడ్ చేసిన మారుతి!
ఇక అందుకు భిన్నంగా సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో డైరెక్టర్ మారుతి ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. అలాగే సినిమాలో కొన్ని సన్నివేశాలు తొలగించినట్లు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో వాటిలో కొన్నింటిని అదనంగా కలుపుతున్నట్లు తెలిపారు. ద్వితియార్దాన్ని కాస్త ట్రిమ్ చేసినట్లు వెల్లడించారు. అలాగే తొలగించిన ప్రభాస్ సన్నివేశాలు యాడ్ చేసినట్లు తెలిపారు. ఆదివారం నుంచి న్యూ వెర్షన్ అందుబాటులో ఉంటుందని.. ప్రత్యేకించి ప్రభాస్ ఓల్డ్ గెటప్‌కు సంబంధించిన సన్నివేశాలు యాడ్ చేశామని చెప్పిన విషయం విధితమే.
ప్రభాస్ ఓల్డ్ గెటప్‌లో అప్సైడ్ డౌన్ ఫైట్ అదుర్స్!
ఈ క్రమంలో ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు మూవీ టీమ్.. ‘రాజాసాబ్ నుండి అప్‌సైడ్ డౌన్ ఫైట్ సీక్వెన్స్ ఇప్పుడు అన్ని థియేటర్లలో ప్రదర్శించబడుతోంది.. అడ్రినలిన్ నిండిన పెద్ద స్క్రీన్ అనుభవం కోసం మీ టిక్కెట్లను ఇప్పుడే బుక్ చేసుకోండి’ అని ప్రభాస్ ఓల్డ్ మ్యాన్ లుక్‌లో ఫైటింగ్ చేస్తున్న వీడియో షేర్ చేశారు. మరి ఈ సీన్స్‌తో అయిన సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుందేమో చూడాల్సి ఉంది.
రాజాసాబ్‌లో యాడ్ చేసిన సీన్స్ సినిమాకు ఏ మేరకు ప్లస్ అవుతాయో చూడాలి. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


