|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజా సాబ్ ప్రభంజనం: ప్రభాస్ మూవీకి ఊహించని రికార్డ్స్! బాక్సాఫీస్ షేక్!

Published: 10-01-2026, 1:00 AM
రాజా సాబ్ ప్రభంజనం: ప్రభాస్ మూవీకి ఊహించని రికార్డ్స్! బాక్సాఫీస్ షేక్!
  • ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ మూవీకి బుకింగ్స్ పరంగా భారీ రెస్పాన్స్ వచ్చింది.
  • ఈ సినిమా మొదటి రోజునే బుక్ మై షోలో 10 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి.
  • సంక్రాంతి సెలవుల కారణంగా సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
  • ప్రభాస్ గ్లామర్, మారుతి కామెడీ టైమింగ్ వసూళ్లకు ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు.

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘రాజా సాబ్’ మూవీ విడుదలైన మొదటి రోజే రికార్డులు సృష్టిస్తోంది. బుకింగ్స్‌లో సినిమాకు ఊహించని స్పందన లభించింది. మొదటి రోజునే 10 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి.

బుకింగ్స్‌లో రాజా సాబ్ మూవీ రికార్డ్

Raja Saab :  టాలీవుడ్ స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాజా సాబ్.. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకుంది.. జనవరి 9న భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ప్రభాస్ ని ఒక కొత్త లుక్ లో చూడాలని ఫ్యాన్స్ ఆశపడ్డారు. ముఖ్యంగా హారర్ కామెడీ అనేసరికి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆత్రుత కనబరిచారు. కొన్ని సీన్లు హైట్ గా ఉండడంతో సినిమానే థియేటర్లలో కచ్చితంగా చూడాలని చాలా మంది థియేటర్లకు వెళ్లారు. మొదటినుంచి కాస్త ఎక్కువగానే అంచనాలు ఉన్నాయి ఈ సినిమా మరో రికార్డ్ చేసింది. అదేంటో ఒకసారి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ కావడంతో జనాలు కూడా తిని చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో నెలల తరబడి రకరకాల చర్చలు జరిగాయి.. రిలీజ్ రోజున థియేటర్ల వద్ద వాతావరణం చూస్తే మాత్రం భారీ లాంచ్ ఈవెంట్ లాగా జరిగింది. పెద్ద సినిమాలకు టాక్ తో పనిలేకుండా జనాల నుంచి మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఇక మరో రికార్డ్ ను బ్రేక్ చేసింది. ప్రముఖ టికెటింగ్ యాప్ బుక్ మై షో లో కేవలం మొదటి రోజే 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. 1 మిలియన్ నంబర్ తో ప్రభాస్ రేంజ్ బయటపడింది. సినిమా టాక్ ఎలా ఉన్నా మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది.. ఈ రికార్డ్ తో మేకర్స్ ఫుల్ హ్యాపిగా ఉన్నారు.

1 మిలియన్ టిక్కెట్లు అమ్మకం

కలెక్షన్లపై సంక్రాంతి ప్రభావం

ప్రభాస్ సినిమాలు అంటే టాక్ తో పనిలేకుండా వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తాయి. మన రాజా సాబ్ మూవీ కూడా అలాంటి రికార్డ్ నే సొంతం చేసుకుంది. నైజాం లో సీడెడ్ లో కూడా అలాంటి రికార్డ్ నే అందుకుంది.. రాజా సాబ్ విషయంలో జనాలు ప్రభాస్ ని స్క్రీన్ మీద చూసేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే వసూళ్ల పరంగా ఎక్కడ తగ్గట్లేదు. ప్రభాస్ గ్లామర్, మారుతి కామెడీ టైమింగ్ వంటి అంశాలు ఈ వసూళ్లకు ప్రధాన కారణమని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.. సంక్రాంతి సెలవులు కారణంగా ఈ సినిమాకు మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.. ఈ వీక్ సంక్రాంతి హాలిడేస్ కావడంతో ఈ సినిమా కు కలెక్షన్స్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి చివరికి ఎన్ని కోట్ల వసూళ్లను అందుకుంటుందో చూడాలి..

మొత్తానికి, ‘రాజా సాబ్’ మూవీ ప్రభాస్ అభిమానులకు ఒక పండుగలాంటి సినిమా అని చెప్పవచ్చు. సంక్రాంతి సెలవుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.