|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజా సాబ్ ప్రీ రిలీజ్: కైతలపూర్‌లోనే ఈవెంట్ వెనుక అసలు రహస్యం ఇదే! అభిమానుల కోసం కీలక నిర్ణయం

Published: 27-12-2025, 7:32 AM
రాజా సాబ్ ప్రీ రిలీజ్: కైతలపూర్‌లోనే ఈవెంట్ వెనుక అసలు రహస్యం ఇదే! అభిమానుల కోసం కీలక నిర్ణయం
  • ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ వేడుక డిసెంబర్ 27న కైతలపూర్ గ్రౌండ్‌లో నిర్వహించబడింది.
  • న్యూ ఇయర్ ప్రోటోకాల్, భద్రతా కారణాలతో పెద్ద గ్రౌండ్లలో నిర్వహణ సాధ్యపడలేదు.
  • కేవలం 8,000 మంది అభిమానులకు మాత్రమే వేడుకలో పాల్గొనేందుకు అనుమతి లభించింది.
  • తొక్కిసలాట ఘటనలను నివారించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కైతలపూర్ గ్రౌండ్‌లో జరుగుతోంది. పెద్ద వేడుకలకు అలవాటైన ప్రభాస్ అభిమానులలో ఈ వేదిక ఎంపికపై పలు సందేహాలున్నాయి. అయితే, దీని వెనుక చిత్ర బృందం స్పష్టం చేసిన కొన్ని కీలక కారణాలున్నాయి.

కైతలపూర్ ఎంపిక వెనుక చిత్ర బృందం కారణాలు

The Raja Saab Pre Release: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన ది రాజా సాబ్ (The Raja Saab)సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే సినిమా నుంచి వరుస అప్డేట్స్ తెలియచేస్తున్నారు. ఇకపోతే నేడు సాయంత్రం ఐదు గంటలకు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాదులో నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా జనవరి 9వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో డిసెంబర్ 27వ తేదీనే ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం కైతలపూర్ (kaithalapur)గ్రౌండ్లో నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కేవలం ఎనిమిది వేల మంది అభిమానులకు మాత్రమే అనుమతి లభించింది. ఇలా ఈ గ్రౌండ్లో ఈ సినిమా ఈవెంట్ నిర్వహించడం ఏంటి అంటూ అభిమానులు కూడా ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కైతలపూర్ గ్రౌండ్లో చేయడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇలా ఈ వేదికను ఎంపిక చేయడం వెనుక గల కారణాలను చిత్ర బృందం వెల్లడించారు.

గత వారం రోజులుగా ప్రభాస్ సినిమా ప్రీ రిలీజ్ పెద్ద గ్రౌండ్ లోనే నిర్వహించాలని ప్లాన్ చేసాము కానీ త్వరలోనే న్యూ ఇయర్ రాబోతున్న నేపథ్యంలో కుదరలేదని తెలిపారు. ఇలా పెద్ద గ్రౌండ్ లో ఈ వేడుకను నిర్వహిస్తే భారీ స్థాయిలో బందోబస్తు అవసరమవుతుంది. ఇలా న్యూ ఇయర్ సందర్భంగా ఉన్న ప్రోటోకాల్ ప్రకారం ఇది కుదరని నేపథ్యంలో చివరికి అభిమానుల క్షేమమే లక్ష్యంగా కైతలపూర్ గ్రౌండ్ ను ఎంపిక చేసినట్లు చిత్ర బృందం వెల్లడించారు. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున తొక్కిసలాట ఘటనలు జరుగుతున్న నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్త చర్యలను చేపడుతున్నారు.

న్యూ ఇయర్ ప్రోటోకాల్, భద్రతా సవాళ్లు

#TheRajaSaabPreReleaseEvent కైతలాపూర్ వద్ద ఉద్రిక్తత.. ప్రభాస్ ఫ్యాన్స్‌పై లాఠిఛార్జ్ #TheRajaSaab #TheRajaSaabOnJan9th #Prabhas‌ #Maruthi @DirectorMaruthi @MusicThaman @peoplemediafcy @rajasaabmovie @shreyasgroup pic.twitter.com/dP0kTod10k

— BIG TV Cinema (@BigtvCinema) December 27, 2025

అభిమానుల క్షేమమే లక్ష్యంగా కీలక నిర్ణయం

ఈ నేపథ్యంలోనే త్వరలోనే న్యూ ఇయర్ రాబోతున్న సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారమే ఇలా కైతలపూర్ గ్రౌండ్లో ఈ వేడుకను నిర్వహించాల్సి వచ్చిందని చిత్ర బృందం వెల్లడించారు. ఇక ఈ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఇక ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ వేడుకకు ప్రభాస్ హాజరు కాబోతున్న నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు భారీ స్థాయిలో అక్కడికి చేరుకోవడంతో గందరగోల వాతావరణ పరిస్థితిలో ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు తప్పనిసరి పరిస్థితులలో ప్రభాస్ అభిమానులపై లాఠీ చార్జ్ చేశారు. ఇక చాలా రోజుల తర్వాత ప్రభాస్ మీడియా ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా వేడుకలో ప్రభాస్ స్పీచ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మొత్తంమీద, ‘ది రాజా సాబ్’ ప్రీ రిలీజ్ వేడుక కోసం కైతలపూర్ గ్రౌండ్‌ను ఎంపిక చేయడం వెనుక చిత్ర బృందం అభిమానుల భద్రతకు, న్యూ ఇయర్ ప్రోటోకాల్‌లకు ప్రాధాన్యతనిచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇది అభిమానుల క్షేమం కోసమే తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.