
📌 Key Points
- ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమా జనవరి 9న విడుదలవుతుండగా, జనవరి 8న ప్రీమియర్స్ పడనున్నాయి.
- తెలంగాణలో ‘రాజా సాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
- టికెట్ రేట్ల పెంపు వివాదం కారణంగా తెలంగాణలో ఆన్‌లైన్ బుకింగ్‌లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.
- ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ‘రాజా సాబ్’ సినిమాకు టికెట్ ధరలను పెంచినట్లు తెలుస్తోంది.
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండగా, టికెట్ ధరల వివాదం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో టికెట్ ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతించలేదని వార్తలు వస్తున్నాయి. దీంతో బుకింగ్‌లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
రాజా సాబ్ టికెట్ ధరల వివాదం
The Raja Saab Ticket Prices: ఈ సంక్రాంతి పండుగ సీజన్‌ను ఘనంగా ప్రారంభిస్తున్న సినిమా ది రాజా సాబ్. స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రం మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పండుగకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఐదు సినిమాలు విడుదల అవుతూ ఉండగా.. అందరికన్నా ముందుగా ప్రభాస్ సినిమా జనవరి 9 థియేటర్స్ లో విడుదల కానుంది. హారర్.. ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు. ప్రయోగాత్మక కథతో ప్రభాస్ కొత్త అవతారంలో కనిపించబోతుండటంతో.. సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
జనవరి 9.. అనగా రేపు శుక్రవారం సినిమా విడుదలవుతూ ఉండగా.. ఒకరోజు ముందే అంతే ఈరోజు జనవరి 8 ప్రీమియర్స్ పడనున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ది రాజా సాబ్ టికెట్ ధరలపై పడింది. ఈ క్రమంలో తెలంగాణలోని కొన్ని ఏరియాల్లో టికెట్లు ధరలు ఫిక్స్ కాకపోవడంతో.. సినిమాకు సంబంధించిన టికెట్లు సాయంత్రం వరకు కూడా..ఆన్లైన్ లోకి రాలేదు.
ఇక రాత్రి కావస్తున్న ఇంకా కూడా తెలంగాణలో టికెట్ రేట్ లో జీవో విడుదల కాలేదు. ఈ క్రమంలో విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇక కాసేపట్లో జీవో విడుదల అవుతుందని…అయితే ఈ సినిమాకి టికెట్ హైక్స్ మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు అని తెలుస్తోంది. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ రేట్లు.. ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమాకి పెంచగా.. తెలంగాణలో మాత్రం ఈ రేట్లను పెంచకుండానే జీవో పాస్ చేస్తున్నారంట..
తెలంగాణలో రేట్లు పెరిగాయా? జీవో ఏం చెప్తోంది?
ఇక ఈ హైక్ సమస్య వల్లే.. టికెట్లు కూడా ఈ సినిమాకి చాలా ఆలస్యంగా విడుదలవుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ అమ్మకాలు ప్రారంభం కాగా..తెలంగాణలోని ప్రేక్షకులు బుకింగ్స్ కోసం తెగ ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ సినిమాకు సంబంధించిన బజ్ బలంగా ఉంది. సినిమా కంటెంట్‌పై యూనిట్ పూర్తి నమ్మకంతో ఉంది. దీంతో ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లో తప్పకుండా బ్లాక్ బస్టర్ సాధిస్తుంది అని తెగ ఎదురుచూస్తున్నారు అభిమానులు.
ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ భారీ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.
సినిమా విడుదల, ప్రీమియర్స్ వివరాలు
ఇక మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్. దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మొత్తానికి.. సంక్రాంతి పండుగకు థియేటర్లలో సందడి మన ప్రభాస్ సినిమాతో..మొదలవుతోంది.
మొత్తానికి, ‘ది రాజా సాబ్’ టికెట్ ధరలపై నెలకొన్న ఉత్కంఠకు తెలంగాణలో తెరపడింది. ధరల పెంపు లేకుండానే జీవో రావడంతో, అభిమానులు టికెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతికి ప్రభాస్ సినిమా ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.


