
📌 Key Points
- రాజమౌళి సినిమాలో వేణు మాధవ్ కామెడీ టైమింగ్ ఒక హైలైట్!
- సై సినిమాలో నల్ల బాలు డైలాగ్ తో వేణు మాధవ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
- విలన్ కంటే పొట్టిగా ఉండటంతో స్టూల్ ఎక్కమన్న రాజమౌళి.. వేణుమాధవ్ మాత్రం నో చెప్పారు!
- వేణు మాధవ్ తీసుకున్న నిర్ణయం సినిమాకి బాగా ప్లస్ అయింది.
టాలీవుడ్ లో సంచలనం! రాజమౌళి దర్శకత్వంలో వేణు మాధవ్ ఒక సినిమాలో నటించారు. ఐతే, ఆ సినిమాలో స్టూల్ ఎక్కడానికి వేణు మాధవ్ నిరాకరించారు. అసలు ఎందుకు? ఏం జరిగింది?
రాజమౌళితో వేణు మాధవ్ వాగ్వాదం?
దర్శకధీరుడు రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో రాజమౌళిపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి. రాజమౌళి సినిమాలో నటించాలని ప్రతి హీరో, హీరోయిన్, నటీనటులు భావిస్తారు. జక్కన్న ఏం చెబితే అది చేయడానికి రెడీగా ఉన్నారు. అలాంటి రాజమౌళి కి ఒకప్పుడు ఓ నటుడు అడ్డు చెప్పాడు. రాజమౌళి చెప్పినట్లు చేయకుండా ఓ కమెడియన్ తన సొంత నిర్ణయం తీసుకున్నారు.
ఆ కమెడియన్ తీసుకున్న నిర్ణయం వల్ల సినిమాకి ప్లస్ అయింది. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో కాదు వేణు మాధవ్. వేణు మాధవ్ కి, రాజమౌళి కి మధ్య మంచి బాండింగ్ ఉంది. సింహాద్రి, సై, ఛత్రపతి లాంటి రాజమౌళి చిత్రాల్లో వేణు మాధవ్ నటించారు.
సై సినిమాలో వేణు మాధవ్ కామెడీ హైలైట్!
ఓ ఇంటర్వ్యూలో వేణు మాధవ్ సై మూవీ విశేషాలు పంచుకున్నారు. ఈ మూవీలో వేణు మాధవ్ బిల్డప్ లు ఇస్తూ విద్యార్థులని, పోలీసులని, రౌడీలని కెలుక్కుంటూ తన్నులు తినే పాత్రలో నటించారు. ఈ మూవీలో వేణు మాధవ్ నల్లబాలు అంటూ చెప్పే డైలాగ్ బాగా ఫేమస్ అయింది. ఈ మూవీలో వేణు మాధవ్ అందరినీ కెలుక్కుని గొడవ పెట్టుకోవడం, ఆ తర్వాత దెబ్బలు తినే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి.
వేణు మాధవ్ మాట్లాడుతూ.. ఓ సీన్ లో ఏకంగా నేను విలన్ తోనే గొడవ పెట్టుకుంటాను. విలన్ వెళుతుంటే పిలిచి మరీ కెలుక్కుంటాను. నాకంటే చాలా హైట్ ఉంటాడు. అయినా కూడా ఓవర్ గా వార్నింగ్ ఇస్తాను. నేను డైలాగ్ చెప్పే తప్పుడు విలన్ హైట్ కి నా హైట్ కి సరిపోవట్లేదు. దీనితో రాజమౌళి గారు నాకోసం స్టూల్ వేసి దానిపై ఎక్కమన్నారు. అప్పుడు డైలాగ్ చెబితే విలన్ కళ్ళలోకి చూస్తూ వార్నింగ్ ఇచ్చినట్లు అవుతుంది అని అన్నారు.
స్టూల్ పై నిలబడటానికి వేణు మాధవ్ ఎందుకు ఒప్పుకోలేదు?
అలా చేస్తే కామెడీ అంతగా పండదు అనేది నా ఫీలింగ్. నేను పొట్టిగా ఉంటూనే విలన్ కి వార్నింగ్ ఇస్తే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. దీనితో రాజమౌళి గారితో సున్నితంగా స్టూల్ వద్దు అన్నా అని చెప్పినట్లు వేణు మాధవ్ తెలిపారు. సై మూవీలో వేణు మాధవ్ కామెడీ ట్రాక్ హైలైట్ గా నిలిచింది.
వేణు మాధవ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


