|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామాయ‌ణంలోని ముఖ్య‌ ఘ‌ట్టమే ”వారణాసి”… స్టోరీ లీక్ చేసిన‌ రాజ‌మౌళి

Published: 15-11-2025, 1:13 PM
రామాయ‌ణంలోని ముఖ్య‌ ఘ‌ట్టమే ''వారణాసి''... స్టోరీ లీక్ చేసిన‌ రాజ‌మౌళి

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ‘వారణాసి’ సినిమా టైటిల్ టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా రాజమౌళి ఈ చిత్రాన్ని రామాయణంలోని ముఖ్య ఘట్టంగా అభివర్ణించారు. మహేష్ కు రాముడి వేషం వేస్తుంటే తనకు గూస్ బంప్స్ వచ్చాయని వెల్లడించారు. ఈ సినిమా కొత్త చరిత్ర సృష్టిస్తుందని పేర్కొన్నారు.

Key Points

1

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో 'వారణాసి' చిత్రం రాబోతుంది.

2

రామోజీ ఫిలిం సిటీలో 'వారణాసి' సినిమా టైటిల్ టీజర్ విడుదల చేశారు.

4

మహేష్ బాబుకు రాముడి వేషం వేస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయని రాజమౌళి వెల్లడించారు.

మహేష్ బాబు ‘వారణాసి’ టైటిల్ టీజర్ విడుదల

మహేష్ బాబు, జక్కన్న కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్ ను కూడా వదిలారు. రామోజీ ఫిలిం సిటీలో స్పెషల్ ఈవెంట్ నిర్వహించిన చిత్ర బృందం, మహేష్ బాబు అభిమానులకు బిగ్ స‌ర్ ఫ్రైజ్‌ ఇచ్చింది. టైటిల్ రివీల్ కావడంతో అభిమానులందరూ ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ సందర్భంగా ఎస్.ఎస్.రాజమౌళి కీలక వ్యాఖ్యలు చేశారు.

మహేష్ బాబుతో సినిమా చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. వారణాసి సినిమా మొదలుపెట్టేటప్పుడు రామాయణంలో ముఖ్యమైన ఘట్టం తీస్తున్నానని అస్సలు అనుకోలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ఒక్కొక్క డైలాగ్, అలాగే ఒక్కో సీన్ రాస్తుంటే నేను నేల మీద నడవడం లేదని, గాల్లో ఉన్నట్లు అనిపించింది అంటూ రాజమౌళి వెల్లడించారు. ప్రిన్స్ మహేష్ బాబుకు రాముడు వేషం వేసి ఆ ఫోటో షూట్ చేస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయని తెలిపారు. ఈ సినిమా సరికొత్త చరిత్ర సృష్టించిందని వెల్లడించారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదని తెలిపారు.

రామాయణంతో వారణాసి సినిమాకి సంబంధం

రాజమౌళి కీలక వ్యాఖ్యలు

రాజమౌళి వ్యాఖ్యలతో మహేష్ బాబు ‘వారణాసి’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామాయణంతో పోలిక, మహేష్ రాముడి వేషంపై చెప్పిన వివరాలు సినిమా కంటెంట్‌పై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.