|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజమౌళి షాకింగ్ నిర్ణయం: ‘వారణాసి’ తర్వాత సినీ ప్రస్థానానికి గుడ్‌బై?

Published: 20-12-2025, 6:04 AM
రాజమౌళి షాకింగ్ నిర్ణయం: 'వారణాసి' తర్వాత సినీ ప్రస్థానానికి గుడ్‌బై?
  • దర్శకుడిగా రాజమౌళికి అపజయం ఎరుగని కెరీర్ కొనసాగుతోంది.
  • మహేష్ బాబుతో ‘వారణాసి’ సినిమా పనులలో రాజమౌళి బిజీగా ఉన్నారు.
  • ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమాలకు గుడ్‌బై చెప్పవచ్చని ఊహాగానాలు వైరల్.
  • సినిమాలకు బదులు ‘మహాభారతం’ వెబ్ సిరీస్ చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు సమాచారం.

దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రాజమౌళి గురించి ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ తర్వాత ఆయన సినిమాలకు గుడ్‌బై చెప్పి, ‘మహాభారతం’ వెబ్ సిరీస్ పై దృష్టి సారిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది.

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్థానం

SS Rajamouli Movie : టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాజమౌళి పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. రాజమౌళి టీవీ సీరియల్స్ డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న రాజమౌళి ఇప్పటివరకు తన కెరియర్లో సుమారు 12 సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించారు అయితే రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సినిమాలు ఏవి ప్రేక్షకులను నిరాశపరచలేదు.

ఇలా అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా వారణాసి సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఐదు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నారనే టాక్ ఉంది. ఇదివరకు మన ఇండియన్ సినీ ఇండస్ట్రీలో లేనివిధంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా దాదాపు సగభాగం షూటింగ్ పూర్తి అయినట్టు ఇటీవల రాజమౌళి వెల్లడించారు. మరొక 7- 8 నెలలలో షూటింగ్ పూర్తి అవుతుందని తెలియజేశారు.

వారణాసి: రాజమౌళి చివరి సినిమానా?

తాజాగా రాజమౌళికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమౌళి డైరెక్షన్లో వారణసి సినిమా ఆఖరి సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమా అనంతరం రాజమౌళి సినిమాలు చేయరనే విషయం సోషల్ మీడియాలో వైరాల్ గా మారడంతో ఒకసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు రాజమౌళి సినిమాలు చేయకపోవడం ఏంటి అంటూ ఆరా తీస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి వారణాసి సినిమా తరువాత మహాభారతం కోసం పని చేయబోతున్నారని సమాచారం. అయితే ఇది సినిమాగా కాకుండా వెబ్ సిరీస్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

అత్యంత భారీ బడ్జెట్ సిరీస్ గా మహాభారతం గేమ్స్  ఆఫ్ త్రోన్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు సమాచారం. మరి రాజమౌళి గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త విన్న అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. ఇక వారణాసి సినిమా విషయానికి వస్తే ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇందులో మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా,పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రకాష్ రాజ్, మాధవన్ వంటి వారు కూడా ఈ సినిమాలో భాగం కానున్నారని సమాచారం.

మహాభారతం వెబ్ సిరీస్‌పై రాజమౌళి ప్లాన్

రాజమౌళి సినిమా కెరీర్‌పై వస్తున్న ఈ వార్తలు ఎంతవరకు నిజం అనేది ఇంకా స్పష్టం కాలేదు. చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు అభిమానులు వేచి చూడాల్సిందే. ఈ వార్త సత్యమేనా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.