|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజీవ్ కనకాల బయటపెట్టిన ప్రభాస్ ‘నిజ స్వరూపం’: అందరూ షాక్.. మహారాజువే!

Published: 23-12-2025, 1:44 AM
రాజీవ్ కనకాల బయటపెట్టిన ప్రభాస్ 'నిజ స్వరూపం': అందరూ షాక్.. మహారాజువే!
  • నటుడు రాజీవ్ కనకాల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ దాతృత్వం గురించి వెల్లడించారు.
  • ఖమ్మంలో ఒక వృద్ధాశ్రమం నిర్మాణానికి ప్రభాస్ ఆర్థికంగా సహాయం అందించారు.
  • వృద్ధాశ్రమానికి ఇప్పటికీ ప్రభాస్ ఎవరికీ తెలియకుండా డబ్బులు పంపిస్తున్నట్లు రాజీవ్ తెలిపారు.
  • ప్రభాస్ నిజంగా మహారాజు వంటి వ్యక్తి అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

నటుడు రాజీవ్ కనకాల ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి పలు సంచలన విషయాలను బయటపెట్టారు. ప్రభాస్ మనస్తత్వం, ఆయన దాతృత్వం గురించి రాజీవ్ వెల్లడించిన నిజాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వృద్ధాశ్రమానికి ప్రభాస్ చేసిన సాయం గురించి ఈ వార్తలో తెలుసుకోండి.

రాజీవ్ కనకాల సంచలన ఇంటర్వ్యూ

Rajeev kanakala : సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా ఈయన నటించిన సినిమాలలో సై సినిమా జనాలని ఎమోషనల్ గా కట్టిపడేసింది. ఇప్పుడు ఈయన సినిమాలలో కీలక పాత్రలో నటిస్తూ వస్తున్నారు.. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో తన భార్య యాంకర్ సుమతో కలిసి సందడి చేస్తుంటాడు. వీరిద్దరూ కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే సుమ ఫ్యాన్స్ విజిల్స్ వేస్తున్నారు. రాజీవ్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తుంటాడు. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో హీరో ప్రభాస్ గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. అసలేం చెప్పాడంటే..

నటుడు రాజీవ్ కనకాల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి మాట్లాడారు.. ఆయన మనస్తత్వం ఎలాంటిదో వివరించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. మేము ఖమ్మంలో ఒక వృద్ధాశ్రమం ప్రారంభించాము. రాజమౌళి, రమా, రమా ప్రభా గారు, ప్రభాస్ ఆ హోమ్ కట్టించడానికి ముందుకు వచ్చారు. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ ను కట్టించాము.. అంతటితో మా పని అయిపోయింది. ఆ తర్వాత మేమెవ్వరం దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు.  కానీ గ్రేట్ థింగ్ ఏంటంటే.. ప్రభాస్ ఇప్పటికీ ఆ హోమ్ కి డబ్బులు పంపిస్తున్నాడు.. ఇలాంటి మంచి గుణం ఎంతమందికి ఉంటుంది అని రాజీవ్ కనకాల ఆ వీడియోలో చెప్పారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో ప్రభాస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. మరొకరికి పెట్టడంలో మా ప్రభాస్ మహారాజు అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ప్రభాస్ సాయం చెయ్యడానికి ఎప్పుడు వెనకడుగు వెయ్యడు.. ఇప్పటికే ఆయన ఎంతోమందికి సాయమందించి రియల్ హీరో అయ్యాడు.

ప్రభాస్ గొప్ప మనసు: వృద్ధాశ్రమానికి సాయం

అభిమానుల ప్రశంసలు: మహారాజు డార్లింగ్

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.. ఈయన చేతిలో ఎప్పుడూ అరడజనుకు పైగా సినిమాలు ఉంటాయి. ఈమధ్య ప్రభాస్ నటిస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో.. చిత్ర నిర్మాతలు ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు ఎన్ని కోట్లైన పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన నాలుగైదు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రభాస్ నటించిన కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రాజా సాబ్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో పాటుగా డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో ఫౌజి సినిమాలో నటిస్తున్నారు.. అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో స్పిరిట్ మూవీలో నటిస్తున్నారు ప్రభాస్. ఈ సినిమాలు అన్నీ కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ప్రభాస్ ఎప్పుడు సాయం చేయడానికి వెనకడుగు వేయడని, ఆయన నిజంగా మహారాజు లాంటి మనసున్న వ్యక్తి అని రాజీవ్ కనకాల వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అభిమానులు కూడా ప్రభాస్ గొప్పదనాన్ని కొనియాడుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.