|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కమెడియన్ అలీని బండ బూతులు తిట్టిన రాజేంద్రప్రసాద్!

Published: 01-06-2025, 10:02 AM
కమెడియన్ అలీని బండ బూతులు తిట్టిన రాజేంద్రప్రసాద్!

టాలీవుడ్‌లో మరో వివాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కమెడియన్ అలీని బూతులు తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

Key Points

1

రాజేంద్రప్రసాద్ కమెడియన్ అలీని బూతులు తిట్టారు.

2

స్వీయ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

4

నటుడిపై సినీ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన తోటి నటుడిని కించపరుస్తూ మాట్లాడి… మరో వివాదానికి తెర లేపారు. కమెడియన్ అలీపై… నోరు పారేసుకుని.. అడ్డంగా దొరికిపోయారు నటుడు రాజేంద్రప్రసాద్. తాజాగా దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి.

అలీపై బూతు ప్రసంగం

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు, నటి నటులు చాలామంది హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేజి పైకి వెళ్లి నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే కమెడియన్ అలీని ఉద్దేశించి ల**** భాష వాడుతూ బండ బూతులు తిట్టారు. దీంతో క్షణాల్లోనే.. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో నటుడు రాజేంద్రప్రసాద్ పై ఫైర్ అవుతున్నారు సినీ ప్రియులు.

వీడియో వైరల్

కమెడియన్ ఆలీ మీద నోరు పారేసుకున్న నటుడు రాజేంద్రప్రసాద్ pic.twitter.com/P9fQxYICnz

రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. సినీ ప్రేక్షకులు ఆయనపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వివాదం మరిన్ని చర్చలకు దారి తీయనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.