
📌 Key Points
- నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల ఎంజీఆర్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
- రాజేంద్రప్రసాద్‌కు కళా ప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డును ప్రకటించారు.
- ఎంజీఆర్.. కాంతారావును చూసి భయపడ్డారని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు.
- రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై తమిళ సినీ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ దివంగత ఎంజీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కాంతారావు అవార్డుల కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడులో దుమారం రేపుతున్నాయి. దీనిపై తమిళ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు
Rajendra Prasad: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నట కిరీటి రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) ఒకరు. కామెడీ చిత్రాల ద్వారా హీరోగా అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు ఇప్పటికీ కూడా వరుస సినిమాలలో అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా రాజేంద్రప్రసాద్ సినిమాల్లో విషయం పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఇటీవల కాలంలో ఈయన తన సినిమాల కంటే కూడా వివాదాల ద్వారానే పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.
మరో వివాదంలో రాజేంద్రప్రసాద్..
రాజేంద్రప్రసాద్ ఏదైనా ఒక వేదిక పైకి వచ్చారంటే ఆయన వివాదాలలో చిక్కుకుంటున్నారని చెప్పాలి. ఇటీవల ప్రతి వేడుకలోను ఈయన నోరు జారుతూ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాలలోకి నెట్టివేస్తున్నాయి. ఇటీవల మంత్రి బట్టి విక్రమార్క కుమారుడు వివాహపు వేడుకలో భాగంగా సెల్ఫీ అడిగిన అభిమాని పై ఈయన చిరాకు పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మర్చిపోకముందే తమిళులు ఆరాధించే నటుడు రాజకీయ నాయకుడు ఎంజీఆర్ (Actor MGR)పై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈయన వ్యాఖ్యలపై తమిళ సినీ ప్రేమికులు రాజకీయ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .
రాజేంద్రప్రసాద్ కు ఇటీవల కళా ప్రపూర్ణ కాంతారావు (Kantharao)జాతీయ అవార్డున ప్రకటించారు. ఇక ఈ అవార్డును మార్చి 9వ తేదీ రాజేంద్రప్రసాద్ కు అందజేశారు. ఇందులో భాగంగానే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా రాజేంద్రప్రసాద్ కాంతారావు గొప్పతనాన్ని తెలియజేస్తూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ,దివంగత నటుడు ఎంజీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జానపద సినిమాలు అంటేనే కాంతారావు అని చెప్పాలి. ఇలా జానపద చిత్రాలలో దూసుకెళ్తున్న కాంతారావును చూసి తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్ ఉ*** న్నాడు అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జానపద సినిమాలలో కాంతారావు స్పీడ్ చూసి వాడెవడు రా బాబోయ్ ఇండియన్ సినిమాలను లేపుకెళ్ళిపోతున్నాడు అంటూ ఎంజీఆర్ భయపడిపోయాడని ఎంజీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.
ఎంజీఆర్ గురించి రాజేంద్రప్రసాద్ కామెంట్స్
తమిళుల ఆరాధ్య దైవం స్వర్గీయ ఎంజీఆర్ గారిని దారుణంగా అవమానించిన టీడీపీ మద్దతుదారుడు నటుడు రాజేంద్ర ప్రసాద్
వీరికి పద్మశ్రీ ఇచ్చిన ప్రభుత్వానికి 🙏🏻 #TDP supporter #RajendraPrasad insults Greatest of all times #MGR .
சின்னத்திரை எம்ஜிஆரை அவமதித்த தெலுங்கு தேசம் கட்சி… pic.twitter.com/Nr1s54pFlU
తమిళుల ఆగ్రహం, నిరసనలు
— UttarandhraNow (@UttarandhraNow) March 10, 2026
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తమిళ సినీ ప్రేక్షకులు రాజేంద్రప్రసాద్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నాయి కాంతారావు గురించి గొప్పలు చెప్పడం తప్పు కాదు కానీ మరొక స్టార్ హీరోని కించపరుస్తూ ఒక వేదికపై మాట్లాడటం సరికాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళ సినీ ఇండస్ట్రీలోనూ రాజకీయాలలోనూ ఎంజీఆర్ అంటే ఒక దేవుడిగా భావిస్తారు అలాంటి వ్యక్తి గురించి రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు పట్ల అభిమానులు మండి పడటమే కాకుండా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. తరచూ రాజేంద్రప్రసాద్ మాట జారడంతో అభిమానులు కూడా రాజేంద్రప్రసాద్ లో మార్పు రాదా? ఈయన మాట తీరు మారదా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో రాజకీయంగా, సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.


