
నటుడు రాజేంద్రప్రసాద్ తన తాజా వివాదాస్పద ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో ఆయన ప్రవర్తన విమర్శలకు దారితీసింది. ఈ వివాదంపై వివరాలివే…
Key Points
రాజేంద్రప్రసాద్ లేటుగా వచ్చి, స్టేజీపై అనుచితంగా ప్రవర్తించారు.
మురళీమోహన్, అలీలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించాయి.
ఈ ఘటనపై ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి నో కామెంట్ అన్నారు.
రాజేంద్రప్రసాద్ కూతురు మరణం బాధలో ఉన్నారని, అందుకే అదుపు తప్పిందని వివరణ ఇవ్వబడింది.
రాజేంద్రప్రసాద్ ప్రవర్తనపై విమర్శలు
నటకిరీటి రాజేంద్రప్రసాద్ ( Rajendra Prasad ) అంటే అందరికీ ఎనలేని గౌరవం. కానీ ఈమధ్య ఆయన తన గౌరవాన్ని తగ్గించుకునేలా ప్రవర్తిస్తున్నారు. అవతలివారిపై నోరు పారేసుకుంటూ తన స్థాయిని దిగజార్చుకుంటున్నారు. రాబిన్ హుడ్ సినిమా సమయంలో వార్నర్‌ను దొంగ నా.. అంటూ తిట్టాడు. ఇటీవల ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో మురళీమోహన్‌ను సిగ్గుందా? అన్నాడు. ఓ హీరోయిన్‌ను బాడీ షేమింగ్ చేశాడు. కమెడియన్ అలీ ( Comedian Ali )ని బూతు మాట అన్నాడు. దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది.
తప్పుగా మాట్లాడటమేగాక.. అలీ స్పందించి రాజేంద్రప్రసాద్ .. కూతురు పోయిన బాధలో ఉన్నాడని, ఈ వివాదాన్ని వదిలేయమని కోరాడు. అటు రాజేంద్రప్రసాద్ కూడా తప్పు గ్రహించి క్షమాపణ చెప్పకపోగా తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకోవడం మీ ఖర్మ అని దబాయించడం గమనార్హం. అయితే ఈ ఈవెంట్‌లో అసలేం జరిగిందన్నది ఇప్పుడు బయటకు వచ్చింది. ఈవెంట్ హోస్ట్, ఓ సీనియర్ జర్నలిస్టు మాట్లాడుతూ.. ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్‌డే కార్యక్రమానికి సెలబ్రిటీలందరూ మనస్ఫూర్తిగా వచ్చారు.
కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో వివాదం
పిలవకముందే స్టేజీపైకి.. రాజేంద్రప్రసాద్ ఈవెంట్‌కు లేటుగా వచ్చారు. నేను ఆయన గురించి ఇంట్రో ఇచ్చాక స్టేజీపైకి రావాలి. కానీ నేను పిలవకముందే తనే స్టేజీపైకి వచ్చి మాట్లాడారు. కాస్త శృతిమించి మాట్లాడారు. ముఖ్యంగా మురళీమోహన్‌గారిని బుద్ధుందా? అనడంతో అందరూ షాకయ్యారు. అలీపైనా నోరు జారాడు. అలా మాట్లాడటాన్ని ఎవరూ సమర్థించరు. ఆ ఫంక్షన్ కంటే కూడా ఈయన తిట్లే వైరలవడం దురదృష్టకరం. అక్కడున్నవారి చాలామంది ముఖాలు మాడిపోయాయి. చాలామంది ఫోన్లు చేసి బాధపడ్డారు. అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి అయితే ఇంకేం మాట్లాడతాం.. నో కామెంట్ అన్నారు.
బాధను మర్చిపోయే క్రమంలో.. రాజేంద్రప్రసాద్.. కూతురు కోల్పోయిన బాధలో ఉన్నారు. ఆ బాధను మర్చిపోయే క్రమంలో కాస్త అదుపు తప్పి మాట్లాడుతున్నారు. నటుడిగా రాజేంద్రప్రసాద్ గురించి వంక పెట్టే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. అంత గొప్ప వ్యక్తి. కానీ, ఈ మధ్యకాలంలో సమతుల్యత తగ్గుతోంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చాడు.
రాజేంద్రప్రసాద్ వివరణ
రాజేంద్రప్రసాద్ తన ప్రవర్తనపై క్షమాపణ చెప్పకపోవడం, కూతురు మరణం బాధను కారణంగా చూపడం వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఈ ఘటన సినీ ప్రముఖులకు ఒక పాఠంగా నిలుస్తుంది.

