
రవితేజ, శ్రీలీల ‘మాస్ జాతర’ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. సినిమా హిట్ కాకపోతే ఇండస్ట్రీని వదిలేస్తానన్న ఆయన సవాల్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Key Points
రవితేజ, శ్రీలీల కాంబోలోని 'మాస్ జాతర' ప్రమోషన్స్ వేడెక్కాయి.
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
'మాస్ జాతర' హిట్ కాకపోతే ఇండస్ట్రీని వదిలేస్తానని సవాల్ విసిరారు.
రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై నెటిజన్లు ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు.
‘మాస్ జాతర’పై రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు
రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌లో వస్తున్న ‘మాస్ జాతర’ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు మరో స్టార్ హీరో సూర్యను పిలిచి మూవీపై మరింత హైప్ పెంచారు. ఈ కార్యక్రమంలో సూర్య, రవితేజపై ప్రశంసల వర్షం కురిపించడమే కాదు.. ఈ చిత్రంలోని డైలాగ్ చెప్పి సినీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేశాడు. కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని, అవ్వాలని కోరుకున్నాడు.
ఇక ఇందులో కీరోల్ ప్లే చేసిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోటిదూలతో వార్తల్లో నిలిచాడు. హాట్ కామెంట్స్‌తో సోషల్ మీడియా డిబేట్స్ జరిగేంత కంటెంట్ ఇచ్చాడు. ‘‘మాస్ జాతర’ మూవీ చూసి షాక్ కాకపోతే ఇండస్ట్రీని వదిలేస్తా’ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో ఈ టాపిక్ కాస్త ట్రోలింగ్‌కు దారి తీసింది. ‘ఉండొచ్చు కానీ మరీ ఇంత నోటి దూల ఉండకూడదు.. సినిమా మీద నమ్మకం ఉన్నా ఇలాంటి స్టేట్మెంట్స్ అవసరమా’ అంటూ పొట్టు పొట్టు వేసుకుంటున్నారు నెటిజన్లు.
ఇండస్ట్రీని వదిలేస్తానన్న సవాల్
నెటిజన్ల ట్రోలింగ్, తీవ్ర విమర్శలు
రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన ఆత్మవిశ్వాసంపై కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే, మరికొందరు నోటిదూలను విమర్శిస్తున్నారు. ‘మాస్ జాతర’ విడుదల తర్వాత ఈ వ్యాఖ్యలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


