
📌 Key Points
- సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లో పడయప్ప (నరసింహ) ఒక బ్లాక్ బస్టర్. ఇది ఆయన కెరీర్‌కు ప్రత్యేకమైన చిత్రం.
- పడయప్ప సినిమాలోని నీలాంబరి పాత్రకు ఐశ్వర్యరాయ్ సరైనవారని రజినీకాంత్ భావించారు, ఆమెను ఎంపిక చేయాలనుకున్నారు.
- ఐశ్వర్యరాయ్ చాలా బిజీగా ఉన్నారని తెలిసినా, ఆమె కోసం రెండు సంవత్సరాలు ఎదురు చూసేందుకు రజినీకాంత్ సిద్ధమయ్యారు.
- ఐశ్వర్యరాయ్ ఆ పాత్ర చేయడానికి ఇష్టం లేదని చెప్పడంతో, చివరికి రమ్యకృష్ణ నీలాంబరిగా ఎంపికై అద్భుతంగా నటించారు.
రజినీకాంత్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘పడయప్ప’ (నరసింహ) చిత్రంలోని నీలాంబరి పాత్ర గురించి ఆసక్తికరమైన బ్యాక్‌స్టోరీ వెలుగులోకి వచ్చింది. ఈ పాత్రకు రజినీకాంత్ మొదట ఐశ్వర్యరాయ్‌ను ఎందుకు అనుకున్నారు? చివరికి రమ్యకృష్ణకు ఆ పాత్ర ఎలా దక్కిందో ఇప్పుడు చూద్దాం.
రజినీకాంత్ నరసింహ సినిమాకు ప్రత్యేకత
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో కొన్ని ప్రత్యేకమైన చిత్రాలలో పడయప్ప ఒకటి. ఇదే సినిమాను తెలుగులో నరసింహ పేరుతో డబ్బింగ్ చేశారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచింది. సూపర్ స్టార్ రజినీకాంత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పాతిక సంవత్సరాల తరువాత ఆ సినిమా చేశారు. ఇప్పటికీ కూడా ఆ సినిమాకి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను మరోసారి ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. అలానే ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఈ సినిమా విడుదలవుతుంది. మొత్తానికి ఈ సినిమా వెనకున్న కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను సూపర్ స్టార్ రజినీకాంత్ వీడియో రూపంలో తెలిపారు.
ఈ సినిమాలో నీలాంబరి అనే పాత్రకు ఐశ్వరరాయ్ కరెక్ట్. ఆవిడే ఈ పాత్రను చేయాలి. రజనీకాంత్ కి అనిపించిందట. అప్పుడు రవికుమార్ సర్ ఆవిడ చాలా బిజీగా ఉంది. చాలా ట్రై చేస్తున్నాను. మూడు నాలుగు సంవత్సరాలు మంచి బిజీగా ఉన్నారు అని చెప్పారు.
నీలాంబరి పాత్రకు ఐశ్వర్యరాయ్ ఎంపిక వెనుక ఆలోచన
అయినా ఈ పాత్రకి ఆమె కరెక్ట్ ఒక రెండు సంవత్సరాలు ఎదురు చూసిన పర్లేదు అని రజనీకాంత్ కూడా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ పాత్ర ఆమెకు చేయడం ఇష్టం లేదు అని చెప్పేసారట. ఇష్టం లేదు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మనం ఎదురు చూడటం అనవసరం అని రజనీకాంత్ వదిలేశారు.
ఆ తర్వాత నీలాంబరి అనే పాత్రను ఎవరు చేస్తారు అని రవికుమార్ ని అడిగారట రజనీకాంత్. అయితే శ్రీదేవి , మీనా, మాధురి దీక్షిత్ అని చాలామంది పేర్లు చెప్పారట రవికుమార్. కానీ ఎవరికీ కూడా ఆ కళ్ళలో ఆ పొగరు కనిపించడం లేదు. ఏం చేద్దాం అని అనుకున్న తరుణంలో హైదరాబాదు నుంచి రవికుమార్ ఫోన్ చేశారు.
సార్ నేను మీకు ఒక పేరు చెప్తాను కొంచెం ఆలోచించండి అని చెప్పారట. ఆ తర్వాత రమ్యకృష్ణ పేరు చెప్పారట. అయితే కొన్ని రోజులు తర్వాత లిఫ్ట్ లో నుంచి రమ్యకృష్ణ నడిచి వస్తుంటే ఆ కళ్ళల్లో పవర్ రజనీకాంత్ కి కనిపించిందట. ఆ తర్వాత రెండు కేజీలు వెయిట్ అనగానే పెరిగింది అంటే సూపర్ గా ఉంటుంది అని అనిపించింది. మొత్తానికి నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయారు.
రమ్యకృష్ణకు నీలాంబరి పాత్ర ఎలా దక్కింది?
ఇప్పటికీ రమ్యకృష్ణ ఎన్ని సినిమాల్లో నటించిన కూడా నీలాంబరి అనే పాత్ర ఆమె కెరియర్ కి చాలా ప్రత్యేకంగా ఉండిపోతుంది. నీలాంబరి, శివగామి పాత్రలు రమ్యకృష్ణ కెరియర్ లో చిరస్థాయిగా మిగిలిపోతాయి. మొత్తానికి ఎవరు చేయవలసిన పాత్రలు వాళ్ల కోసమే రాసిపెట్టి ఉన్నాయి అన్నట్లు ఐశ్వర్యరాయ్ చేయాల్సిన పాత్ర రమ్యకృష్ణ చేశారు.
మొత్తానికి కొన్ని పాత్రలు కొందరి కోసమే రాసిపెట్టి ఉన్నాయని ఈ సంఘటన నిరూపించింది. రమ్యకృష్ణ నీలాంబరి పాత్రలో ఒదిగిపోయి చరిత్ర సృష్టించారు. ఆ పాత్ర ఆమె కెరీర్‌కు మాయని మచ్చగా నిలిచిపోయింది.


