|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విమర్శల వేళ ఆదుకున్న వారికి రజనీ థాంక్స్! రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న సూపర్ స్టార్ ట్వీట్!

Published: 17-03-2026, 3:35 AM
విమర్శల వేళ ఆదుకున్న వారికి రజనీ థాంక్స్! రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న సూపర్ స్టార్ ట్వీట్!
  • రజనీకాంత్‌కు మద్దతు తెలిపిన రాజకీయ నాయకులకు, సినీ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపిన రజనీకాంత్.
  • వ్యక్తిగత విమర్శలను ఖండిస్తూ అండగా నిలిచిన అభిమానులకు రజనీకాంత్ ధన్యవాదాలు.
  • పాత విషయాలను పట్టుకుని కొత్త తరం రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని రజనీకాంత్ వ్యాఖ్య.
  • రజనీకాంత్ వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతల విమర్శలు, సోషల్ మీడియాలో దుమారం.

సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో తనకు మద్దతుగా నిలిచిన రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు మరియు అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తనకు అండగా నిలిచిన వారికి రజనీకాంత్ కృతజ్ఞతలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) పై కొందరు అసభ్యకరమైన, దూషణలతో సోషల్ మీడియా వేదిక తో పాటు, మీడియా సాక్షిగా విమర్శలు చేశారు. ఈ క్రమంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతు రజనీకాంత్ భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేశారు. తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, అన్బుమణి రామదాస్, తన స్నేహితుడు అన్నామలై సహా వివిధ పార్టీల రాజకీయ నాయకులు తనకు మద్దతు తెలపడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

రాజకీయ నాయకులపై రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు

రాజకీయ నాయకులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన అమీర్, ధనంజయన్ వంటి మిత్రులకు, మీడియా ప్రతినిధులకు కూడా రజనీకాంత్ ధన్యవాదాలు చెప్పారు. “అన్నిటికంటే మిన్నగా.. తాను దైవ సమానంగా భావించే నా అభిమానులు నన్ను నిలబెట్టి, ఉత్సాహపరిచిన తీరు మరువలేనిది” అంటూ ఆయన ఆవేదన, కృతజ్ఞత నిండిన మాటలను పంచుకున్నారు. తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులను ఖండించిన ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ప్రస్తావిస్తూ రజినీకాంత్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రజనీకాంత్‌పై విమర్శలు గుప్పించిన అధికార పార్టీ నేతలు

ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ మాట్లాడుతూ, “కొంతమంది రాజకీయ నాయకులు పాత విషయాలనే పట్టుకుని వేలాడుతూ, కొత్త తరం ముందుకు రాకుండా అడ్డుపడుతున్నారు” అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ఇది అధికార పార్టీకి చెందిన కొందరు నేతలను ఉద్దేశించి చేసినట్లుగా భావించి, వారు రజనీకాంత్‌పై మీడియా, సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు.

రజనీకాంత్ కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.