|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rajinikanth : నరసింహ పార్ట్ 2 వచ్చేస్తుంది.. ఇట్స్ రివెంజ్ టైం…

Published: 09-12-2025, 1:08 AM
Rajinikanth : నరసింహ పార్ట్ 2 వచ్చేస్తుంది.. ఇట్స్ రివెంజ్ టైం…
  • రజినీకాంత్ నటించిన నరసింహ సినిమా సీక్వెల్ పై ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
  • ‘ది రిటర్న్స్ ఆఫ్ పడయప్ప’లో రజనీకాంత్ ఈ సీక్వెల్ గురించి చర్చించినట్లు సమాచారం.
  • నీలాంబరి ప్రతీకారంతో స్టోరీని కంటిన్యూ చేయనున్నట్లు వార్తలు.
  • రజినీకాంత్ పుట్టినరోజున నరసింహ సినిమాను రీ-రిలీజ్ చేయనున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు శుభవార్త! ఆయన సూపర్ హిట్ చిత్రం నరసింహకు సీక్వెల్ రానుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ‘ది రిటర్న్స్ ఆఫ్ పడయప్ప’లో దీనిపై చర్చ జరిగిందని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రావచ్చని తెలుస్తోంది.

నరసింహ సీక్వెల్ పై ఉత్కంఠ

Rajinikanth : తమిళ సూపర్ రజినీ కాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. దాదాపుగా ఐదు దశాబ్దాలకు పైగా భారతీయ సినీ రంగాన్ని ఏలుతున్నాడు. కోలీవుడ్ లో మాత్రమే కాదు ఇటు తెలుగులో కూడా రజిని సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఇక్కడ కూడా ఆయనకు డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. స్టైల్, స్వాగ్, మేనరిజం, పంచ్ డైలాగ్స్‌… రజనీకాంత్‌ను ఒక బ్రాండ్‌గా మార్చేశాయి.. ఒక బస్సు కండక్టర్ గా ఉన్న ఆయన ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా వెలుగుతున్నాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు రజినీ.. ఈ వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు..ఇదిలా ఉండగా ఆయన నటించిన నరసింహ మూవీ సీక్వెల్ పై ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తల్లో నిజమేంత ఉందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

సూపర్ స్టార్ రజినీకాంత్, రమ్యకృష్ణ, స్వర్గీయ నటి సౌందర్య నటించిన సూపర్ హిట్ మూవీ నరసింహ.. అప్పట్లో ఈ సినిమాకు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అభిమానులకు పంచ్ డైలాగ్స్, స్టైలిష్ ఎంట్రీలు, ఎమోషన్‌కి బ్రాండ్‌గా నిలిచిపోయింది. ముఖ్యంగా రజనీ డైలాగ్ డెలివరీ, గెటప్స్, బాడీ లాంగ్వేజ్ అప్పటి యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ ఎన్ని సార్లు టీవీల్లో వచ్చినా కూడా టీవీలకు అతుక్కిపోయి చూస్తున్నారు. అయితే.. తమిళ్ లో పడయప్ప పేరుతో సినిమా వచ్చింది. తాజాగా ది రిటర్న్స్ ఆఫ్ పడయప్పలో రజనీకాంత్ ఈ సినిమా సీక్వెల్ గురించి చర్చించుకున్నట్లు తెలిపారు. ఎలాగైనా సరే పగ తీర్చుకుంటాను అని నీలాంబరి చెప్పిన డైలాగ్ తో స్టోరీని కంటిన్యూ చెయ్యనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ వార్త విన్న తలైవా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇకపోతే రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా నరసింహ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే..

పడయప్ప ది రిటర్న్స్: కథా నేపథ్యం

రజినీ అభిమానుల ఆనందం: రీ-రిలీజ్

రజినీకాంత్, నాగార్జున ప్రధాన పాత్రల్లో వచ్చిన లేటెస్ట్ చిత్రం కూలీ.. ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ విజయని సొంతం చేసుకోవడంతో పాటుగా మంచి కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకుంది.. ప్రస్తుతం రజినీ జైలర్ మూవీకి సీక్వెల్ గా రాబోతున్న జైలర్ 2 మూవీలో నటిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా తర్వాత రజనీకాంత్ రిటర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు మరోవైపు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. రజినీకాంత్ ప్రస్తుతం కొత్త సినిమాల కథలను వినడం లేదని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఏది ఏమైనా కూడా ఆ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే మరో సినిమాను ప్రకటించేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..

మొత్తంగా, నరసింహ సీక్వెల్ వార్తలు రజినీ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి. పగ తీర్చుకునే నీలాంబరి కథాంశం ఆసక్తిని రేపుతోంది. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని అందరూ ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.