|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తలైవా కితాబు: ‘దురంధర్ 2’ అద్భుతం! రజనీకాంత్ ప్రశంసలతో ఆదిత్యధర్ భావోద్వేగం!

Published: 24-03-2026, 2:35 AM
తలైవా కితాబు: 'దురంధర్ 2' అద్భుతం! రజనీకాంత్ ప్రశంసలతో ఆదిత్యధర్ భావోద్వేగం!
  • రజనీకాంత్ ‘ధురంధర్ 2’ సినిమాను అద్భుతంగా అభివర్ణించారు.
  • దర్శకుడు ఆదిత్యధర్ రజనీకాంత్ ప్రశంసలకు ఎమోషనల్ గా స్పందించారు.
  • రజనీకాంత్ ను స్ఫూర్తి ప్రదాతగా అభివర్ణించారు ఆదిత్యధర్.
  • ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘ధురంధర్ 2’ సినిమా చూసి చిత్ర యూనిట్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. దీనికి దర్శకుడు ఆదిత్యధర్ ఎంతో భావోద్వేగంగా స్పందించారు. ఆయన రజనీకాంత్ పట్ల తనకున్న అభిమానాన్ని, కృతజ్ఞతను తెలియజేశారు.

రజనీకాంత్ ప్రశంసలు

Rajinikanth Praise Dhurandhar 2: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ‘సూపర్‌స్టార్’ అనే పదానికి నిలువెత్తు రూపం రజనీకాంత్. ఆయన ఒక చిన్న సినిమాను మెచ్చుకున్నా, అది బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభావాన్ని చూపిస్తుంది. తాజాగా విడుదలైన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్ 2’ చూసిన తలైవా, చిత్ర యూనిట్‌ను ఆకాశానికెత్తేశారు. “ధురంధర్ 2 – ఒక అద్భుతమైన సినిమా. మేకింగ్ లో కొత్త ఒరవడిని సృష్టించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం (Must Watch)” అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటికే ఆదిత్యధర్ పై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంది. తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ లాంటి వారే సినిమా ను పొగడటంతో దర్శకుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Read also- Paradise Movie: నాచురల్ స్టార్ నాని ‘ద పారడైజ్’ ఆగస్టు విడుదల ఖాయమేనా!.. లేకపోతే..

ఆదిత్యధర్ ఎమోషనల్ రిప్లై

రజనీకాంత్ చేసిన ఈ ప్రశంసకు దర్శకుడు ఆదిత్య ధర్ ఎంతో ఎమోషనల్ అవుతూ బదులిచ్చారు. రజనీకాంత్ ను కేవలం ఒక నటుడిగానే కాకుండా, ఒక తరానికి స్ఫూర్తిప్రదాతగా అభివర్ణిస్తూ ఆయన రాసిన మాటలు అభిమానుల మనసు గెలుచుకుంటున్నాయి. “సార్, దశాబ్దాలుగా మాకు ‘వినోదం’ అంటే మీరే బెంచ్ మార్క్. మీ యాక్టింగ్, ఆ స్వగ్, మీ గ్రేస్ చూస్తూనే మేమంతా పెరిగాము. మమ్మల్ని ఈలలు వేయించారు, నవ్వించారు, కంటతడి పెట్టించారు. మీరు ఈ సినిమాను ‘మస్ట్ వాచ్’ అని అనడం నా జీవితంలో అతిపెద్ద ‘సూపర్‌స్టార్’ మూమెంట్‌గా భావిస్తున్నాను.”

ఆదిత్య ధర్ తన రిప్లైలో రజనీకాంత్ పట్ల ఉన్న అపారమైన గౌరవాన్ని చాటుకున్నారు. “మా అందరికీ పెద్ద కలలు కనడం నేర్పిన వ్యక్తి నుంచి లభించిన ఆశీర్వాదంలా ఇది నాకు అనిపిస్తోంది. నా కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు. ఇది నేరుగా నా మనసును తాకింది” అంటూ ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు. చివరగా ‘జై హింద్’ అంటూ తన రిప్లైను ముగించారు.

‘ధురంధర్ 2’ విజయం

Read also- Mythri Flops: మైత్రీ మూవీ మేకర్స్ …. వరుసగా డిజాస్టర్ల వర్షం.. బయ్యర్ల గుండెల్లో గునపం

ప్రస్తుతం ఆదిత్య ధర్ ఇచ్చిన ఈ రిప్లై స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. రజనీకాంత్ వంటి లెజెండ్ ప్రశంసలు దక్కించుకోవడం ఒక ఎత్తైతే, ఆదిత్య ధర్ అంతే హుందాగా సమాధానం ఇవ్వడం సినిమా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ‘ధురంధర్ 2’ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుండగా, ఇప్పుడు సూపర్‌స్టార్ మద్దతు కూడా తోడవడంతో ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించే దిశగా దూసుకుపోతోంది. దర్శకుడి వినయం, రజనీకాంత్ పట్ల ఆయనకు ఉన్న భక్తి చూస్తుంటే, సినిమా పట్ల వారికి ఉన్న అంకితభావం స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ ట్వీట్స్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నాలుగు రోజుల్లో అయిదు వందల కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ధురంధర్ మొదటి భాగం దాదాపు రూ.1300 కోట్ల రూపాయలు వసూలు చేస్తే ఈ సినిమా రెండు వేల కోట్ల వరకూ వసూలు చేస్తుందిని నిర్మాతలు నమ్ముతున్నారు. ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మిరి.

‘ధురంధర్ 2’ సినిమాకు రజనీకాంత్ మద్దతు లభించడంతో, ఇది మరింతమంది ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉంది. ఆదిత్యధర్ స్పందన సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.