📌 Key Points
- రజనీకాంత్ తలైవర్ 173లో టైలర్‌గా కనిపించనున్నారు, ఇది ఆయన కెరీర్‌లోనే భిన్నమైన పాత్ర.
- ఈ సినిమా 2022లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ‘ది ఔట్‌ఫిట్’ నుండి ప్రేరణ పొందింది.
- సిబి చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
- పూజా హెగ్డే, ప్రియాంక మోహన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రియాంక పాత్ర కథను నడిపిస్తుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ తన 173వ సినిమాలో టైలర్‌గా కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సినిమా హాలీవుడ్ చిత్రం ‘ది ఔట్‌ఫిట్’ నుండి ప్రేరణ పొందినట్లు సమాచారం. దీనికి సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు.
తలైవర్ 173లో రజనీకాంత్ టైలర్ పాత్ర!
Thalaivar 173: సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆయన నటించబోయే కొత్త సినిమా పేరు తలైవర్ 173గా ప్రస్తుతం పరిగణిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో రజనీకాంత్ పూర్తిగా కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నారంట.
ప్రస్తుతం వస్తున్న బలమైన సమాచారం ప్రకారం..ఈ సినిమాలో ఆయన టైలర్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఆయన కెరీర్‌లో చాలా భిన్నమైన పాత్ర కావడంతో అభిమానుల్లో పెద్ద ఎత్తున ఆసక్తి పెరిగింది.
ఇప్పటివరకు యాక్షన్..మాస్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన రజనీకాంత్.. ఈసారి మాత్రం కథకు ప్రాధాన్యం ఉన్న సాధారణ వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నారు. టైలర్‌గా ఆయన నటన ఎలా ఉండబోతుందో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పాత్రలో ఆయన నటన చాలా సహజంగా.. నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
‘ది ఔట్‌ఫిట్’ సినిమా నుండి ప్రేరణ?
తలైవర్ 173 సినిమా 2022లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ది ఔట్‌ఫిట్ నుంచి ప్రేరణ పొందిందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కథ మొత్తం ఆ సినిమా నుంచి ప్రేరణ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో ఒక చిన్న టైలర్ షాప్ చుట్టూ తిరిగే కథ, డ్రామా, సస్పెన్స్ ప్రధానంగా ఉంటాయి. ఇదే తరహాలో ఈ సినిమాకూడా బలమైన కథతో.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. అయితే ఈ కథ గురించి అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
మొదట ఈ సినిమాకు దర్శకుడిగా సుందర్ సీ వ్యవహరించాల్సి ఉండగా..కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అనంతరం ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలను సిబి చక్రవర్తి తీసుకున్నారు. ఈ మార్పు అభిమానులను ఆశ్చర్యపరిచినా, సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఈ చిత్రానికి సంగీతం అందించేది యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. ఆయన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ తరహా కథలకు బాగా సరిపోతుందని అభిమానులు భావిస్తున్నారు.
ఈ సినిమాలో కీలక పాత్రల కోసం పూజా హెగ్డే, ప్రియాంక మోహన్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపించే అవకాశం ఉందని టాక్. అయితే వీరిద్దరికీ రజనీకాంత్‌తో ప్రేమ కథ ఉండదని సమాచారం. ముఖ్యంగా ప్రియాంక మోహన్ పాత్ర కథను ముందుకు నడిపించే ముఖ్యమైన పాత్రగా ఉంటుందని చెబుతున్నారు. పూజా హెగ్డే పాత్ర కూడా కథకు బలంగా ఉండే అవకాశం ఉందట.
కీలక పాత్రల్లో పూజా హెగ్డే, ప్రియాంక మోహన్
ఇంకా ఒక అనుభవజ్ఞురాలైన సీనియర్ నటి కూడా ఈ సినిమాలో చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా మూడు బలమైన మహిళా పాత్రలతో రూపొందే అవకాశముంది. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయ్యాక ఏప్రిల్ నెలలో తలైవర్ 173 షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాను పొంగల్ 2027 సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అధికారిక అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మొత్తానికి రజనీకాంత్ టైలర్ పాత్రలో ఎలా మెప్పిస్తారో చూడాలనీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ‘ది ఔట్‌ఫిట్’ నుండి ప్రేరణ పొందినట్టు తెలుస్తోంది. విడుదల కోసం వేచి చూడాల్సిందే.


