|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాకాస మూవీ: సంగీత్ శోభన్ పారితోషికంపై షాకింగ్ నిజాలు! ఇంత తక్కువ రెమ్యూనరేషనా?

Published: 04-04-2026, 12:35 AM
రాకాస మూవీ: సంగీత్ శోభన్ పారితోషికంపై షాకింగ్ నిజాలు! ఇంత తక్కువ రెమ్యూనరేషనా?
  • సంగీత్ శోభన్ నటించిన ‘రాకాస’ మూవీ ఏప్రిల్ 3న విడుదలైంది.
  • ఈ సినిమా ప్రీమియర్ షోలతోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
  • సంగీత్ శోభన్ రెమ్యూనరేషన్ కోటి 50 లక్షలు అని సమాచారం.
  • ‘రాకాస’ మూవీకి 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది.

సంగీత్ శోభన్ హీరోగా నటించిన ‘రాకాస’ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా కోసం సంగీత్ శోభన్ తీసుకున్న రెమ్యూనరేషన్ తక్కువగా ఉందని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రాకాస మూవీ విడుదల, టాక్ మరియు కలెక్షన్లు

Rakasa Movie : రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి రాకాస.. యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.. ప్రీమియర్ షో లతోనే ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. నిన్న రిలీజ్ అయిన సినిమా జనాలు ఎంత క్రేజ్ ని సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు కూడా తమ నటనకు 100% న్యాయం చేశారు అంటూ జనాలు నుంచి వార్తలు వినిపించాయి. అంతేకాదు ప్రీమియర్ షో లతో పాటుగా నిన్న పడ్డ షోలతో కూడా మంచి కలెక్షన్లు వసూలు చేసింది.. సినిమాలో హీరో సంగీత్ శోభన్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమాకు గాను ఈయన రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో వార్త ప్రచారంలో ఉంది.. ఈ సినిమాకు హీరో ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. మరి ఆలస్యం ఎందుకు? హీరో ఎన్ని కోట్లు తీసుకున్నాడో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా భారీగా కలెక్షన్ లో వర్షం ని కూడా కురిపిస్తూ వస్తుంది.. కేవలం ఒక్కరోజులో దాదాపు లక్షకు పైగా బుక్ మై షో లో టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. ఇలాంటి హిట్ సినిమాలో హీరోగా నటించిన సంగీత్ శోభన్ రెమినరేషన్ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈయన మ్యాడ్అలాగే మ్యాడ్ స్క్వేర్ సినిమాలలో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.. దాంతో ఈ సినిమాకి కూడా ఎక్కువగానే రెమ్యూనరేషన్వచ్చింది అని అంచనా వేస్తున్నారు.. ఈ చిత్రానికి ఆయన తీసుకునే రెమ్యూనరేషన్ కేవలం కోటి 50 లక్షల రూపాయిలు మాత్రమే అన్నమాట.. ఈ సినిమాకు బడ్జెట్ 15 కోట్ల వరకు అయిందన్న విషయం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.. అయితే ఈ హీరోకి ఇంత తక్కువ రెమ్యూనరేషన్ఇ వ్వడం పై పలు చర్చలు కూడా మొదలయ్యాయి.. మరి సినిమా లాభాలలో ఏదైనా బాట ఉందేమో చూడాలి..

సంగీత్ శోభన్ రెమ్యూనరేషన్ వివరాలు

సినిమా బడ్జెట్ మరియు బిజినెస్ వివరాలు

రాకాస మూవీకి 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.. ఈ సినిమాకు బాగానే జరిగినట్లు తెలుస్తుంది.. ఆంధ్రలో 4.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, నైజాంలో 4 కోట్ల రూపాయలు మేర 10 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. ఇకపోతే మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 13.5 కోట్ల రూపాయల షేర్.. 27 కోట్ల రూపాయల గ్రాస్‌ను బ్రేక్ఈవెన్‌గా నిర్దేశించారు. అంటే మొత్తం కలిపి ఇంత రావాలి.. ఇదే కాదు నెట్‌ఫ్లిక్స్ దాదాపు 10 కోట్ల రూపాయల ఫ్యాన్సీ ధరను వెచ్చించి దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కడంతో నాలుగు కోట్లకు పైగా వసూళ్లను అందుకునే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు. మరి ఎన్ని కోట్లు వసూలు చేశాయో మరికాసేపట్లో తెలిసే అవకాశం ఉంది..

రాకాస మూవీలో సంగీత్ శోభన్ రెమ్యూనరేషన్ తక్కువగా ఉండటం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సినిమా లాభాలలో వాటా ఉంటే హీరోకి కొంత న్యాయం జరిగే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.