|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ కెరీర్‌పై అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు! మగధీర, ధృవ వెనుక అసలు కథ ఇదేనా?

Published: 27-03-2026, 4:35 AM
రామ్ చరణ్ కెరీర్‌పై అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు! మగధీర, ధృవ వెనుక అసలు కథ ఇదేనా?
  • రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ సినిమా నుంచి అదిరిపోయే సర్ ప్రైజ్!
  • మామ అల్లు అరవింద్.. అల్లుడు రామ్ చరణ్‌తో ‘మగధీర’, ‘ధృవ’ సినిమాలు నిర్మించడం వెనుక అసలు కారణం ఇదే!
  • ‘మగధీర’, ‘ధృవ’ సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించాలనే స్వార్థంతో నిర్మించానని అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు.
  • ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్.. ఏప్రిల్ 30న విడుదల!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. అల్లు అరవింద్ రామ్ చరణ్ తో సినిమాలు తీయడం వెనుక అసలు రహస్యం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లు అరవింద్ స్వార్థం వెనుక అసలు నిజం!

మెగా పవర్‌ స్టార్‌, గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తోన్న రామ్‌ చరణ్‌ ఇప్పుడు తన 41వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. శ్రీరామ నవమి పండుగ సందర్భంగానే ఆయన బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకోవడం విశేషం. ఈ క్రమంలో చరణ్‌ నటిస్తోన్న `పెద్ది` సినిమా నుంచి సర్‌ ప్రైజ్‌ వచ్చింది. కండలు తిరిగిన దేహంతో చరణ్‌ అదగొడుతున్నాడు. గద పట్టుకుని పహెల్వాన్‌ గా ఆయన కుస్తీ గ్రౌండ్‌లోకి దిగే సన్నివేశాలు అదిరిపోయాయి. గూస్ బంమ్స్ తెప్పిస్తున్నాయి. కుస్తీ పోటీకి చరణ్‌ రెడీ అవుతున్నట్టుగా ఈ సీన్లు ఉన్నాయి. ఇందులో క్రికెట్‌ మాత్రమే కాదు, కుస్తీ వంటి చాలా ఆటలు ఉంటాయని దీన్ని బట్టి అర్థమవుతుంది.

ఇదిలా ఉంటే రామ్‌ చరణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ `మగధీర`, `ధృవ`, `రంగస్థలం`, `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రాలుగా చెప్పొచ్చు. అయితే ఇందులో `మగధీర`, `ధృవ` చిత్రాలను మామ అల్లు అరవింద్‌ నిర్మించారు. ఆయనే కావాలని ఈ చిత్రాలను నిర్మించారు. అల్లుడు చరణ్‌ కోసం ఆయన ఈ చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఈ చిత్రాలను నిర్మించడం వెనక కారణాన్ని వెల్లడించారు. అది కూడా తన సొంత స్వార్థం కోసం నిర్మించారట. ఈ విషయాన్ని ఓపెన్‌ గా బయటపెట్టాడు అల్లు అరవింద్‌.

రామ్ చరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ ఇవే!

రామ్‌ చరణ్‌ నటించిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలు రెండూ తాను నిర్మించినవే ఉండాలని ఆయన ఈ పనిచేశాడట. ఈ స్వార్థంతోనే ఈ సినిమాలను నిర్మించినట్టు వెల్లడించారు అరవింద్‌. `మగధీర`, `ధృవ` చరణ్‌తో రెండు సినిమాలు నిర్మించా. తన కెరీర్‌ గ్రాఫ్‌ చూస్తే, అందులో అత్యధిక వసూళ్లని సాధించిన రెండు సినిమాలూ నావే ఉండాలనే స్వార్థంతో ఈ సినిమాలు నిర్మించాను` అని అన్నారు. `ధృవ` సినిమా టైమ్‌లో ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. ఎన్వీ ప్రసాద్‌తో కలిసి అరవింద్‌ ఈ మూవీని నిర్మించారు.

రామ్‌ చరణ్‌ ఇప్పుడు `పెద్ది` సినిమాలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఓ వైపు చరణ్‌ ఎడమకన్ను వద్ద గాయమైనా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా, శివ రాజ్‌ కుమార్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ఏప్రిల్‌ 30న విడుదల కాబోతుంది. చరణ్‌ నటించిన `ఆచార్య`, `గేమ్‌ ఛేంజర్‌` చిత్రాలు పరాజయం చెందాయి. ఈ క్రమంలో ఇప్పుడు `పెద్ది`తో ఎలాగైనా కొట్టాలని చూస్తున్నారు.

పెద్ది మూవీతో చరణ్ సంచలనం సృష్టిస్తాడా?

ఈ సినిమా తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు రామ్‌ చరణ్‌. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే `రంగస్థలం` చిత్రం వచ్చింది. ఇది అప్పట్లో నాన్‌ బాహుబలి రికార్డులను బ్రేక్‌ చేసింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌ లో మూవీ రాబోతుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. దీన్ని సుకుమార్‌ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే అవకాశం ఉంది.

అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. రామ్ చరణ్ రాబోయే సినిమాల గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.