|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షర్ట్ లేకుండా 18 ఏళ్ళ క్రితం ఒకే చోట రాంచరణ్, అల్లు అర్జున్.. ఈ రేర్ ఫోటో వెనుక కథేంటో తెలుసా

Published: 04-09-2025, 3:15 AM
షర్ట్ లేకుండా 18 ఏళ్ళ క్రితం ఒకే చోట రాంచరణ్, అల్లు అర్జున్.. ఈ రేర్ ఫోటో వెనుక కథేంటో తెలుసా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి ఉన్న 18 ఏళ్ల క్రితం తీసిన ఒక రేర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో వెనుక కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Key Points

1

18 ఏళ్ల క్రితం బ్యాంకాక్ లో చిరుత చిత్ర షూటింగ్ సమయంలో తీసిన ఫోటో.

2

అల్లు అర్జున్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో రాంచరణ్ పాల్గొన్నారు.

4

మెగా-అల్లు కుటుంబాల మధ్య అద్భుతమైన బంధాన్ని చూపించే ఫోటో.

రేర్ ఫోటో వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలుగా రాణిస్తున్నారు. పుష్ప 2 చిత్రంతో అల్లు అర్జున్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న రాంచరణ్.. ఆ తర్వాత గేమ్ ఛేంజర్ మూవీతో నిరాశపరిచాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే చిత్రంలో నటిస్తున్నాడు.

మెగా ఫ్యామిలీ మొత్తం సందర్భం వచ్చినప్పుడల్లా కలుసుకుంటుంటారు. ఇటీవల మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు అంటూ రూమర్స్ వచ్చాయి. కానీ ఇటీవల అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం మరణించినప్పుడు మరోసారి అల్లు, కొణిదెల కుటుంబాల మధ్య బాండింగ్ కనిపించింది. ఇది పక్కన పడితే 18 ఏళ్ళ క్రితం అల్లు అర్జున్, రాంచరణ్ ఇద్దరూ కలసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బ్యాంకాక్ లోని చిరుత షూటింగ్

ఈ ఫోటో వెనుక ఆసక్తికర స్టోరీ ఉంది. రాంచరణ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చిరుత చిత్రంతో 2007లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. చిరుత చిత్రం మంచి విజయం సాధించింది. రాంచరణ్ డ్యాన్స్, ఫైట్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం బ్యాంకాక్ లో జరిగింది. డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి బ్యాంకాక్ ఫెవరేట్ డెస్టినేషన్.

బ్యాంకాక్ లో చిరుత షూటింగ్ జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ తన బర్త్ డే సెలబ్రేషన్ కోసం అక్కడికి వెళ్లారు. చిరుత షూటింగ్ లొకేషన్స్ కి సందర్శించారు. ఆ సమయంలో అల్లు అర్జున్, రాంచరణ్ ఇద్దరూ షర్ట్ లేకుండా కేవలం బనియన్లు మాత్రమే ధరించి చిల్ అవుతూ కనిపించారు. చిరుత షూటింగ్ లొకేషన్ లోనే అల్లు అర్జున్ బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి.

మెగా-అల్లు కుటుంబాల బంధం

అల్లు అర్జున్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో దేశముదురు, ఇద్దరమ్మాయిలతో అనే చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 800 కోట్ల బడ్జెట్ లో రూపొందనుంది.

చిరుత చిత్రం షూటింగ్ సమయంలో తీసిన ఈ ఫోటో, మెగా మరియు అల్లు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని మరోసారి చాటుతుంది. ఈ రేర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.