|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Hari Hara Veera Mallu Release: బాబాయ్‌ సినిమాను పట్టించుకోని రామ్ చరణ్.. ఆ ఇద్దరు మాత్రమే!

Published: 24-07-2025, 6:41 AM
Hari Hara Veera Mallu Release: బాబాయ్‌ సినిమాను పట్టించుకోని రామ్ చరణ్.. ఆ ఇద్దరు మాత్రమే!

పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జూలై 24న విడుదలైంది. మెగా హీరోలు చాలామంది సినిమాకు శుభాకాంక్షలు తెలిపినా, రామ్ చరణ్ మాత్రం సైలెంట్‌గా ఉండటం గమనార్హం.

Key Points

1

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్‌కు మెగా హీరోలు మద్దతు తెలిపారు.

2

రామ్ చరణ్ మాత్రం సినిమా విడుదలకు ముందు ఎలాంటి పోస్ట్ పెట్టలేదు.

4

బిజీ షెడ్యూల్ వల్లే రామ్ చరణ్ పోస్ట్ పెట్టలేకపోయి ఉండొచ్చని అభిప్రాయాలు.

వీరమల్లు రిలీజ్‌కు మెగా హీరోల స్పందన

పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం హరిహర వీరమల్లు . దాదాపు ఐదేళ్లపాటు షూటింగ్ చేసిన ఈ సినిమా ఎట్టకేలకు జూలై 24 న థియేటర్లలో విడుదలైంది . ఎప్పటి నుంచి ఈ చిత్రం కోసం నిరీక్షించిన అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు . బాక్సాఫీస్ బద్దలవుతుందని రిలీజ్ ‌ కు ముందు హల్ ‌ చల్ ‌ చేశారు . కానీ తొలి ఆట నుంచే ఊహించని విధంగా ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు . ఉత్సాహంగా థియేటర్ ‌ కు వెళ్లిన అభిమానులు .. బయటికి వచ్చేటప్పుడు మాత్రం ఆ జోష్ కనిపించలేదు . దీంతో తొలిరోజే వీరమల్లుకు పెద్ద షాక్ ‌ తగిలినట్లే అర్థమవుతోంది .

రామ్ చరణ్ సైలెన్స్‌పై నెటిజన్ల చర్చ

అయితే హరిహర వీరమల్లు రిలీజ్ ‌ కావడంతో మెగా హీరోలంతా పవన్ కల్యాణ్ సినిమాకు ఆల్ ది బెస్ట్ ‌ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . మెగా హీరోల్లో వరుణ్ తేజ్ , సాయి ధరమ్ తేజ్ ‌ ట్వీట్ చేస్తూ సినిమా సక్సెస్ కావాలంటూ ట్వీట్ చేశారు . వీరితో పాటు పలువురు టాలీవుడ్ తారలు వీరమల్లు చిత్రం రిలీజ్ ‌ వేళ మద్దతుగా పోస్టులు పెట్టారు .

బిజీ షెడ్యూల్‌ కారణమా?

అయితే మెగా హీరో , చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మాత్రం బాబాయ్ సినిమా రిలీజ్ ‌ కు ముందు ఎలాంటి పోస్ట్ చేయలేదు . ట్రైలర్ రిలీజ్ ‌ రోజు మాత్రమే పోస్ట్ పెట్టిన చెర్రీ .. హరిహర వీరమల్లు విడుదలకు ముందు ఎలాంటి విషెస్ ‌ చెప్పలేదు . దీంతో బాబాయ్ ‌ సినిమాకు చెర్రీ పోస్ట్ ‌ పెట్టకపోవడంపై నెటిజన్స్ ‌ చర్చించుకుంటున్నారు . మరోవైపు పెద్ది సినిమాతో బిజీగా ఉండడం వల్లే కుదరక పోయి ఉండొచ్చని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు . ఏదేమైనా బాబాయ్ చిత్రానికి మెగా హీరో రామ్ చరణ్ సపోర్ట్ చేయకపోవడం గమనార్హం .

చివరికి, రామ్ చరణ్ హరిహర వీరమల్లుకు మద్దతు తెలపకపోవడం చర్చనీయాంశంగా మారింది. బిజీ షెడ్యూల్ లేదా ఇతర కారణాలేమైనా ఉండొచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.