
📌 Key Points
- రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు.
- యాక్షన్ సీన్స్ చేస్తుండగా కాలికి స్వల్ప గాయమైంది.
- వైద్యుల సలహా మేరకు రామ్ చరణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు.
- 2026 జూన్ 26న సినిమా విడుదల కానుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. యాక్షన్ సీన్స్ చేస్తుండగా స్వల్ప గాయమైంది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
‘పెద్ది’ షూటింగ్‌లో రామ్ చరణ్‌కు గాయం
Ram Charan Injured: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఇటీవల సెట్స్‌లో చరణ్ గాయపడిన వార్త మెగా అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. దీనికి సంబంధించి ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read also- అనన్య నాగెళ్ల యోగా చేస్తే ఇంత క్యూట్‌గా ఉంటుందా.. వీడియో చూశారా?
వైరల్ అవుతున్న రామ్ చరణ్ ఫోటో
విశ్వసనీయ సమాచారం ప్రకారం, ‘పెద్ది’ చిత్రానికి సంబంధించి ఒక కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రామ్ చరణ్ సాధారణంగానే యాక్షన్ సన్నివేశాల్లో డూప్ సహాయం తీసుకోకుండా స్వయంగా నటించడానికి మొగ్గు చూపుతుంటారు. ఈ క్రమంలోనే ఒక రిస్కీ షాట్ చేస్తున్నప్పుడు ఆయన కాలికి స్వల్ప గాయం అయినట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి, ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. వైద్యులు కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో, ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ కారణంగా షూటింగ్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలో రామ్ చరణ్ గాయంతో కనిపిస్తుండటం మెగా ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు “గెట్ వెల్ సూన్ అన్న”, “త్వరగా కోలుకోవాలి” అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను నింపేస్తున్నారు. అయితే, ఇది పెద్ద ప్రమాదం ఏమీ కాదని, కేవలం స్వల్ప గాయం మాత్రమేనని చిత్ర బృందం స్పష్టం చేసింది. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత చరణ్ మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెడతారని సమాచారం.
సినిమా విడుదల ఎప్పుడు?
Read also- విజయ్ అఫిడవిట్లో సంగీత ఆస్తులు విలువ.. మండిపడుతున్న నెటిజన్స్!
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఉండబోతోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక విభిన్నమైన లుక్‌లో కనిపించబోతున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ చిత్రం ప్రస్తుతం 2026 జూన్ 26న విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు ఈ సినిమా మార్చి 30 రిలీజ్ డేట్ ప్లాన్ చేశారు. అధికారికంగా అయితే ఇంకా ఏ సమాచారం రాలేదు. సినిమా కోసం ఎంతటి రిస్క్ అయినా చేసే రామ్ చరణ్ డెడికేషన్ చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకుని, మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో షూటింగ్‌లో పాల్గొనాలని కోరుకుందాం.
రామ్ చరణ్ త్వరగా కోలుకుని మళ్ళీ షూటింగ్‌లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు. సినిమా విడుదల కోసం ఎదురు చూద్దాం.


