
రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, లండన్‌కు వెళ్ళబోతున్నారు. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకకు ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరుకానున్నారు.
Key Points
రామ్ చరణ్ మేడమ్ టుస్సాడ్స్ లండన్ వ్యాక్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఆవిష్కరణ
మొట్టమొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ గా ఈ గౌరవాన్ని అందుకుంటున్న రామ్ చరణ్
రామ్ చరణ్ పెంపుడు కుక్క విగ్రహం కూడా మ్యూజియంలో ప్రదర్శన
మే 9న లండన్‌లో ఈ వేడుక వైభవంగా జరగనుంది
మేడమ్ టుస్సాడ్స్ లండన్‌లో రామ్ చరణ్ మైనపు విగ్రహం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం పెద్ది షూటింగ్‌లో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. బుచ్చిబాబు సనా(Buchibabu Sana) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, రామ్ చరణ్ ఓ అరుదైన గౌరవం అందుకున్నట్లు సమాచారం. దీంతో ఆయన ‘పెద్ది’ షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చి వెంటనే ఫ్యామిలీతో కలిసి లండన్ బయలుదేరబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళితే.. మేడం టుస్పాడ్స్ లండన్ వ్యాక్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు.
మొట్టమొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ రామ్ చరణ్ కావడం విశేషం. ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్స్ విగ్రహాలను ఆవిష్కరించినప్పటికీ అవి సింగపూర్, దుబాయ్ మ్యూజియాల్లో ఉన్నాయి. కానీ ప్రధానంగా లండన్ మ్యూజియంలో పెట్టడం మొదటిసారి. అయితే ఇందులో ఆయన పెంపుడు జంతువు రైమ్ టాయ్ పూడిల్ జాతికి చెందిన పప్పీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఈ వేడకకు హాజరయ్యేందుకు రామ్ తన భార్య ఉపాసన(Upasana), తండ్రి చిరంజీవి(Chiranjeevi), కూతురు క్లిన్ కారా, తల్లి సురేఖలతో లండన్‌కు వెళ్లబోతున్నారట. అయితే ఈ వేడుక మే 9న లండన్ టైమ్ ప్రకారం సాయంత్రం 6:15 గంటలకు జరగబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మొట్టమొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ గా రామ్ చరణ్
రామ్ చరణ్ కుటుంబంతో లండన్ పర్యటన
రామ్ చరణ్ లండన్ పర్యటనతో మెగా అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఈ అరుదైన గౌరవం ఆయన సినీ జీవితంలో మరో మైలురాయి.


