|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: రామ్ చరణ్ పహిల్వాన్ బాడీ కోసం అన్ని కోట్లు ఖర్చు చేశాడా? మామూలు షాక్ కాదు ఇది!

Published: 31-03-2026, 2:35 AM
షాకింగ్: రామ్ చరణ్ పహిల్వాన్ బాడీ కోసం అన్ని కోట్లు ఖర్చు చేశాడా? మామూలు షాక్ కాదు ఇది!
  • రామ్ చరణ్ కొత్త సినిమా కోసం కండలు తిరిగిన దేహం, హల్క్ లాంటి లుక్!
  • రోజుకి 15 గంటలు జిమ్, ప్రత్యేక డైట్ ఫాలో అయిన రామ్ చరణ్.
  • రామ్ చరణ్ పర్ఫెక్షన్ కోసం ఎంత కష్టమైనా పడతానన్న నిబద్ధత.
  • మెగా పవర్ స్టార్ పెద్ది సినిమాతో సరికొత్త రికార్డు సృష్టిస్తాడని అంచనాలు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కొత్త సినిమా కోసం చేస్తున్న కష్టం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఆయన పడిన కష్టం, పెట్టిన ఎఫర్ట్ చూస్తే సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. రామ్ చరణ్ ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు కొల్లగొడతాడో చూడాలి.

రామ్ చరణ్ కండల వెనుక ఎంత కష్టం?

సినిమాలు గతంలో మాదిరిగా లేవు.. ఆడియన్స్ కూడా ఇదివరకట్లా లేరు. హీరోలు ఎంత కష్టపడుతున్నా… ఎంత రిస్క్ చేస్తున్నా.. ఇంకా ఏదో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇదివరకు హీరోలు నాలుగు పాటలు, మూడు ఫైట్లు.. రెండు రొమాంటిక్ సీన్లు.. క్లైమాక్స్ సెంటిమెంట్ తో.. హిట్లు కొట్టే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొత్తదనం కోసం, ఆడియన్స్ అటెన్షన్ కోసం .. హీరోలు చాలా రిస్క్ లు చేయాల్సి వస్తోంది. ఎన్నో వేశాలు వేయాల్సి వస్తోంది. ఆకరికి తమ గ్లామర్ ఇమేజ్ ను కూడా పక్కన పెట్టి.. డీ గ్లామర్ రోల్స్ చేయాల్సి వస్తోంది.

రంగస్థలంలో చెవిటి సత్తిబాబుగా రామ్ చరణ్, పుష్పలో స్మగ్లర్ గా అల్లు అర్జున్, ఇలాంటి పాత్రలతో పాటు.. బాడీ బిల్డ్ చేసుకోవడం, సిక్స్ ప్యాక్ లు, 8 ప్యాక్ లు, డ్యాన్స్ మూమెంట్స్ లో వేరియేషన్లు.. క్యారెక్టరేజేషన్ దగ్గర నుంచి డైలాగ్స్ వరకూ ఏదైనా కొత్తగా కనిపించాలని అంచనాలు పెంచుకుంటున్నారు. అందుకు తగట్టే హీరోలు వాటి కోసం ఎన్నో కుస్తీ పాట్లు పడాల్సి వస్తోంది. ఆకరికి నేచురల్ స్టార్ నాని కూడా జడలు వేసుకుని మరీ.. ప్యారడైజ్ లో కొత్త లుక్ లో కనిపించి ఆశ్చర్చపరిచాడు.

పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరికొత్త లుక్!

ఇక రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే పెద్ది సినిమా గ్లింప్ తో బుర్రతిరిగే షాక్ ఇచ్చాడు. కుస్తీ వీరుడిగా కనిపించి ఆశ్చర్చపరిచాడు. పెద్ది సినిమా నుంచి రీసెంట్ గా రామ్ చరణ్ లుక్ వీడియో రిలీజ్ అయ్యింది. ఆయన బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ వీడియోలో రామ్ చరణ్ బాడీ చూసీ అంతా షాక్ అయ్యారు. హల్క్ మాదిరిగా చరణ్ కండలు తిరిగిన దేహంతో మెస్మరైజ్ చేశాడు. కుస్తీ వీరుడిగా చరణ్ షాట్స్ నిజంగా ఆడియన్స్ కు పిచ్చెక్కించాయి.

రామ్ చరణ్ ఇంతలో అంత బాడీని ఎలా బిల్డ్ చేశాడబ్బా అంటూ.. పెద్ద చర్చ ఇండస్ట్రీతో పాటు.. బయట కూడా మొదలయ్యింది. పెద్ది సినిమాతో చరణ్ పెద్ద ప్లాన్ వేసినట్టు అర్ధం అవుతోంది. అయితే ఇంత బాడీని బిల్డ్ చేయడానికి రామ్ చరణ్ ఎంత కష్టపడి ఉంటాడని అంత ఆలోచనలో పడ్డారు. ఇంతకీ చరణ్ ఏం చేశాడో తెలుసా?

రామ్ చరణ్ డెడికేషన్ కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

అంత బాడీని బిల్డ్ చేయడం కోసం రామ్ చరణ్ చాలా డైట్ ప్లాన్ ను ఫాలో అయ్యాడట. రోజులో దాదాపు 15 గంటలకు పైగా జిమ్ చేసేవాడట. చరణ్ పడుతున్న కష్టం చూసి.. అప్పటి వరకూ ఉన్న బాడీ సరిపోతుంది.. మ్యానేజ్ చేద్దాం.. అని అన్నాడట. కానీ రామ్ చరణ్ మాత్రం పర్ఫెక్షన్ కోసం.. క్యారెక్టర్ కి సరిపోయే విధంగా బాడీ ఉండాలని చెప్పి రంగంలోకి దిగాడు. గ్లింప్స్ లో ఆయన బాడీ మామూలుగా లేదు. ఆ క్యారెక్టర్ లో ఇంటెన్స్ రావాలంటే నేను హల్క్ లాగా మారాల్సిందే అని రామ్ చరణ్ చెప్పి మరి తను బాడీని బిల్డ్ చేశాడట.

రామ్ చరణ్  అలా మారడానికి ఒక స్పెషల్ కోచ్ ను కూడా నియమించుకున్నాడట చరణ్. ఆ కోచ్ కి దాదాపు మూడు నెలకు కలిపి 3 కోట్ల రూపాయలను చెల్లించినట్టుగా తెలుస్తోంది… రామ్ చరణ్ తన సొంత డబ్బులను ఖర్చుపెట్టుకుని మరి అంత బాడీని బిల్డ్ చేశారట.ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి ఎంత ఇంటెన్స్ తో నటిస్తాడో రామ్ చరణ్ సైతం అదే విధంగా నటిస్తూ ప్రతి ప్రేక్షకుడిని తన వైపు తిప్పుకోవడానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ వాడుకుంటున్నాడు… పెద్ది సినిమా సూపర్ సక్సెస్ అయితే మాత్రం రామ్ చరణ్ క్రేజ్ తారా స్థాయికి వెళ్లిపోవడం పక్కా.

రామ్ చరణ్ పెద్ది సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. ఆయన కష్టం వృథా పోదనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.