
📌 Key Points
- రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలోని ‘రై రై రా రా’ పాటలో 300 మంది డాన్సర్లు పాల్గొననున్నారు.
- ‘మగధీర, రంగస్థలం’ రోజులను గుర్తు చేసేలా చరణ్ డాన్స్ ఉండబోతోందని సమాచారం.
- ఈ పాట రామ్ చరణ్ అభిమానులకు ఒక పెద్ద పండగలా ఉంటుందని అంటున్నారు.
- సోమవారం రాత్రి 7 గంటల 2 నిమిషాలకు ‘రై రై రా రా’ పాట విడుదల కానుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని ‘రై రై రా రా’ పాట విడుదల కానుంది. ఈ పాటలో 300 మంది డాన్సర్లు పాల్గొన్నారు. సోమవారం రాత్రి 7 గంటల 2 నిమిషాలకు పాటను విడుదల చేయనున్నారు.
‘రై రై రా రా’ సాంగ్ అప్‌డేట్స్
Peddi Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘పెద్ది’ (Peddi Movie). రామ్ చరణ్ 16వ చిత్రమిది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ (Chikiri Chikiri) సాంగ్ ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. రామ్ చరణ్, జాన్వీ కపూర్‌ల కాంబోలో వచ్చిన ఆ సాంగ్, రిలీజైన నిమిషం నుంచే శ్రోతల హృదయాలను దోచేసింది. ఇప్పుడు రెండో సాంగ్‌కు సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో వచ్చిన తాజాగా అప్డేట్ మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేస్తుంది. అదేంటంటే..
‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎంత రస్టిక్‌గా ఉంటుందో, పాటలు కూడా అంతే ఎనర్జిటిక్‌గా ఉండబోతున్నాయి. ఆ విషయం ‘చికిరి చికిరి’నే హింట్ ఇచ్చేసింది. ఇప్పుడు రాబోయే ‘రై రై రా రా’ అనే సాంగ్ కోసం చిత్ర యూనిట్ భారీ ఏర్పాట్లు చేసింది. ఏకంగా 300 మంది ప్రొఫెషనల్ డాన్సర్ల మధ్య చరణ్ తనదైన గ్రేస్‌తో స్టెప్పులు ఇరగదీశారట. ‘మగధీర, రంగస్థలం’ సినిమాల్లో చరణ్ డాన్స్ చూసి ఫిదా అయిన అభిమానులకు, ఈ పాట మళ్ళీ ఆ రోజులను గుర్తు చేయబోతోందని టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు మొదలయ్యాయి. చరణ్ బాడీ లాంగ్వేజ్, ఆ ఎనర్జీ చూస్తుంటే ఇది కేవలం పాట మాత్రమే కాదు, థియేటర్లలో ఫ్యాన్స్‌కు ఒక పెద్ద పండగలా ఉండబోతుందని క్లియర్‌గా అర్థమవుతోంది.
చరణ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది?
ఇప్పటికే షూటింగ్ స్పాట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సాంగ్‌లో చరణ్ పర్ఫార్మెన్స్ KCPD అనే రేంజ్‌లో ఉండబోతోందని అంటున్నారు. సినిమా బ్యాక్‌డ్రాప్‌కు తగ్గట్టుగా రా అండ్ రస్టిక్ స్టెప్పులతో చరణ్ విశ్వరూపం చూపించబోతున్నారట. ఆ విశ్వరూపం ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకా కొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు. సోమవారం రాత్రి 7 గంటల 2 నిమిషాలకు ఈ పాటను మేకర్స్ విడుదల చేయబోతున్నారు. ఈ పాటకు సంబంధించి ఇప్పటికే వచ్చిన స్టిల్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 300 మంది డాన్సర్లతో అత్యంత భారీగా ఈ పాటను చిత్రీకరించారని తెలుస్తోంది. అలాగే ఏఆర్ రెహమాన్ మరోసారి తన మార్స్ ప్రదర్శించారనేలా పాట విన్నవాళ్లంతా రియాక్ట్ అవుతున్నారు. రామ్ చరణ్ రేంజ్‌కు తగ్గట్టుగా, బుచ్చిబాబు ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ప్లాన్ చేస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ పాటతో ‘పెద్ది’ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతాయని చిత్రయూనిట్ కూడా భావిస్తోంది. చూద్దాం మరి పాట ఎలా ఉంటుందో..
At 7:02 PM, the gRaCe God takes Charge 💣 #RaiRaiRaaRaa Explodes TODAY 💥🔥
పాట విడుదల ఎప్పుడు?
Vocals & music by the legendary ‘Isai Puyal’ @arrahman Sir 🎶⚡ #PEDDI pic.twitter.com/US6d3l5QvC
— PEDDI (@PeddiMovieOffl) March 2, 2026
‘పెద్ది’ సినిమాలోని ఈ పాట రామ్ చరణ్ అభిమానులకు ఒక ప్రత్యేక అనుభూతిని ఇవ్వనుంది. రేపు పాట విడుదల కోసం ఎదురుచూస్తూ, చరణ్ స్టెప్పులతో ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి.


