
📌 Key Points
- రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ మూవీలో అనుష్క శర్మ నటించే అవకాశం.
- ఈ సినిమాలో అనుష్క శర్మ పాత్ర ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ అని సమాచారం.
- విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మను తీసుకోవడంపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
- రాజమౌళి సినిమాలో చిన్న పాత్రలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నటించనుందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె ఒక కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం.
వారణాసి మూవీలో అనుష్క శర్మ?
Varanasi Movie : టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం వారణాసి. ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, హీరోయిన్ గా ప్రియాంక చోప్రా మందాకిని అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుంది. అలాగే మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కుంభ పాత్ర పోషిస్తున్నాడు.. టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చేసింది.. ఈ మూవీలో స్టార్ క్రికెటర్ భార్య కీలక పాత్రలో నటించబోతుందంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆమె ఎవరు? ఏ పాత్రలో నటించబోతుంది అన్నది ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
మాములుగా చెప్పాలంటే రాజమౌళి సినిమా అంటే క్యాస్టింగ్ కూడా భారీగానే ఉంటుంది. ఆయన సినిమాలో చిన్న చిన్న పాత్రలు కూడా హైలైట్ అవుతుంటాయి.. ఎప్పుడూ తన సినిమాల్లో స్పెషల్ గా ఉండాలని ప్లాన్ చేస్తాడు రాజమౌళి. అలానే ఈ మూవీలో కూడా ఇండియన్ స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ను కీలక పాత్రలో దింపబోతున్నాడు.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా క్రేజ్ ని సంపాదించుకున్న అనుష్కను దించడంపై ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికే ఈ విషయంలో ఆమెతో ప్రాథమిక చర్చలు కూడా జరిగినట్లు సమాచారం.. త్వరలోనే ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఒక క్రేజీ హీరోయిన్ ని ఆయన తీసుకురావడంపై టాలీవుడ్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అనుష్క శర్మ పాత్ర వివరాలు
రాజమౌళి ప్లానింగ్ ఏమిటి?
రాజమౌళి సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులు ఊహకు అందని విధంగా ఉంటాయి.. బాహుబలి మూవీతో ఒక ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన ఆ తర్వాత తెరకెక్కించే ప్రతి సినిమా కూడా జనాల అంచనాల కన్నా ఎక్కువగానే చూపిస్తుంటాడు. ఇప్పుడు మహేష్ బాబు తో తెరకెక్కిస్తున్న సినిమా కూడా గ్లోబల్ అడ్వెంచర్ తో రావడంతో ఈ సినిమాలో ప్రతి ఒక్కరిని డిఫరెంట్ గా చూపించాలని జక్కన్న భావిస్తున్నాడు. కథలో భాగంగా కొన్ని కీలక సన్నివేశాలకు అనుష్క శర్మ వంటి అనుభవం ఉన్న నటి అయితే బాగుంటుందని టాక్. అలాంటి పాత్రలో అనుష్క శర్మ పాత్ర కథను మలుపు తిప్పే మిస్టీరియస్ క్యారెక్టర్ అని సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే ఆమె కెరియర్ కి ఇదొక టర్నింగ్ పాయింట్ అవుతుంది.. ఈమధ్య అనుష్క యాక్షన్ సినిమాల కన్నా ఎక్కువగా సెన్సిటివ్ పాత్రలు ఉన్న సినిమాలను చేస్తూ వస్తుంది.. అంతే కాదు ఈ ముద్దుగుమ్మ ఈమధ్య హీరోయిన్గా కన్నా నిర్మాతగా బిజీ అవుతున్నారు.. మరి జక్కన్న ఆఫర్ ని ఒప్పుకుంటుందా? లేదా? అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇకపోతే వారణాసి సినిమా షూటింగ్ విషయానికొస్తే.. ఈ మూవీ దాదాపు 70% పైగా షూటింగ్ని పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. మరో రెండు నెలల్లో మిగతా భాగం పూర్తి చేసి.. ప్రమోషన్స్ ని మొదలుపెట్టే ఆలోచనలో జక్కన్న ఉన్నట్లు సమాచారం.
మొత్తానికి రాజమౌళి ఈ సినిమాలో అనుష్క శర్మను తీసుకుంటే సినిమాకు మరింత క్రేజ్ వస్తుంది. ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.


