|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఈ నగరానికి ఏమైంది 2: మాస్ అప్డేట్! రిలీజ్ డేట్ ఫిక్స్.. యూత్ ఎగిరి గంతులేస్తున్నారు!

Published: 08-07-2026, 5:11 AM
ఈ నగరానికి ఏమైంది 2: మాస్ అప్డేట్! రిలీజ్ డేట్ ఫిక్స్.. యూత్ ఎగిరి గంతులేస్తున్నారు!

యూత్ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది ‘ఈ నగరానికి ఏమైంది’. ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ సీక్వెల్ ‘ఈNఈ రిపీట్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది! ఈ వార్తతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. నవంబర్ 19న థియేటర్లలో రచ్చ చేయడానికి సిద్ధంగా ఉండండి!

Key Points

1

'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ 'ఈNఈ రిపీట్' నవంబర్ 19న విడుదల.

2

తరుణ్ భాస్కర్ హిట్ సినిమాకు 8 ఏళ్ళ తర్వాత అదిరిపోయే సీక్వెల్.

4

థాయిలాండ్ లో షూటింగ్ పూర్తి, గ్లింప్స్ తో అంచనాలు పీక్స్.

యూత్ అల్లేసిన ‘ఈNఈ’ సీక్వెల్ రెడీ!

Ee Nagaraniki Emaindi 2 : 2018లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది చిన్న సినిమాగా వచ్చి మంచి విజయం సాధించింది. యూత్ కి బాగా కనెక్ట్ అయింది ఈ సినిమా. ఈ సినిమా రీ రిలీజ్ లో కూడా రిలీజ్ కంటే ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో ప్రేక్షకుల కోరిక మేరకు ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 ప్రకటించారు.

నవంబర్ 19న థియేటర్లలో రచ్చ!

ఎనిమిదేళ్లుగా అదిగో ఇదిగో అంటూ ఇటీవలే కొన్ని నెలల క్రితం ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 షూటింగ్ మొదలు పెట్టారు. పార్ట్ 1లో ఉన్న నటీనటులంతా ఈ సినిమాలో కొనసాగుతున్నారు. సాయి సుశాంత్ రెడ్డి ప్లేస్ లో శ్రీనాథ్ మాగంటి వచ్చారు. శివాత్మిక కూడా ఈ సినిమాలో చేరింది. ఇప్పటికే ఈ సినిమా థాయిలాండ్ లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది.

గ్లింప్స్ తో గూస్ బంప్స్.. కొత్త యాడ్ ఏంటి?

నేడు ఈ నగరానికి ఏమైంది సినిమా రిలీజయి 8 ఏళ్ళు అవుతుండటంతో ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 ‘ఈNఈ రిపీట్’ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈNఈ రిపీట్ సినిమా నవంబర్ 19న రిలీజ్ కానున్నట్టు ప్రకటించారు. ఈ డేట్ ప్రకటిస్తూ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఇందులో నలుగురు హీరోలు విశ్వక్ సేన్, సాయినాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను ఓ కార్ లో ముస్తఫా.. సాంగ్ పెట్టుకొని వెళ్తున్నట్టు చూపించారు. ఈ సారి గోవా నుంచి థాయిలాండ్ కి వెళ్లే ట్రిప్ తో కథ ఉంటుందని తెలుస్తుంది.

‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది నిజంగా పండగే. నవంబర్ 19న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌ల కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.