|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ డేట్ షాక్! ఊహించని కారణంతో వాయిదా!!

Published: 04-02-2026, 8:35 AM
రామ్ చరణ్ 'పెద్ది' రిలీజ్ డేట్ షాక్! ఊహించని కారణంతో వాయిదా!!
  • రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ విడుదల తేదీ మార్పు! ఏప్రిల్ 30న గ్రాండ్ రిలీజ్!
  • పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘పెద్ది’ వాయిదా.. అసలు కారణం వేరే!
  • బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ మాస్ లుక్.. ‘పుష్ప’ రేంజ్ కథ!
  • జాన్వీ కపూర్ హీరోయిన్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ చిత్రం!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ మూవీ విడుదల తేదీలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. అసలు ఈ మార్పులకు గల కారణాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఎందుకీ సడెన్ ట్విస్ట్? ‘పెద్ది’ వాయిదాకు కారణం ఇదేనా?

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం `పెద్ది` చిత్రంలో నటిస్తున్నారు. `ఉప్పెన` ఫేమ్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మార్చి 27న విడుదల చేయబోతున్నట్టు గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు రిలీజ్‌ డేట్‌ మారింది. తాజాగా కొత్త తేదీని ప్రకటించారు.

పవన్‌ కళ్యాణ్‌ నటించిన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీని `పెద్ది` డేట్‌కి ఫిక్స్ చేశారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. అనంతరం ఇప్పుడు `పెద్ది` మూవీకి సంబంధించి కూడా కొత్త డేట్‌ని ప్రకటించారు. ఈ మూవీని ఏప్రిల్‌లో విడుదల చేయబోతున్నారు. ఏప్రిల్‌ 30న రిలీజ్‌ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు కొత్త పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు.

పవన్ vs రామ్ చరణ్.. బాక్సాఫీస్ వార్ తప్పదా?

`పెద్ది` సినిమా వాయిదా పడటానికి కారణం ఏంటనేది చూస్తే, ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అంతా పవన్‌ కళ్యాణ్‌ కోసం అనుకుంటున్నారు. పవన్‌ నటించిన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` కోసం వాయిదా పడిందనే టాక్‌ నడుస్తుంది. కానీ నిజం ఏంటేంటే `పెద్ది` వాయిదా పడటం వల్లే `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`ని ఆ డేట్‌ని రిలీజ్‌ చేస్తున్నారు. మార్చి 26న మంచి స్లాట్‌గా భావించి పవన్‌ మూవీని రిలీజ్‌ చేస్తున్నారు.

ఇక `పెద్ది` సినిమా షూటింగ్‌ ఇంకా పూర్తి కాలేదు. ఇంకా చాలా వర్క్ ఉందట. కొంత ప్యాచ్‌ వర్క్, సాంగ్స్, పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ పూర్తి కాలేదట. దానికి ఇంకా టైమ్‌ పడుతుంది. నెల రోజులు ఆ వర్కే అవుతుందని, అందుకే మార్చి 26న రిలీజ్‌ చేయడం కష్టమని భావించిన మేకర్స్ నెల రోజులు వాయిదా వేశారు. ఏప్రిల్‌ 30న ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఇలా నెల రోజుల గ్యాప్‌తోనే అటు పవన్‌ కళ్యాణ్‌, ఇటు రామ్‌ చరణ్‌ థియేటర్లలో సందడి చేయబోతున్నారని చెప్పొచ్చు.

రామ్ చరణ్ మాస్ లుక్.. ‘పుష్ప’ను మరిపిస్తోందా?

`పెద్ది` మూవీ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతుంది. ఇందులో రామ్‌ చరణ్‌ క్రికెటర్‌ అంటే ఇష్టపడే వ్యక్తిగా కనిపిస్తాడట. రామ్‌ చరణ్‌ లుక్‌ ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంది. ఊరమాస్‌ లుక్‌లో అదరగొడుతున్నారు. ఇది సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. `పుష్ప` సినిమాని తలపిస్తుంది. కథ కూడా అదే రేంజ్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, `చికిరి` సాంగ్‌ ఆద్యంతం ఆకట్టుకుని వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

రామ్ చరణ్ ‘పెద్ది’ ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.