|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Peddi : గ్లోబల్ స్టార్ చెప్పిన తర్వాత ఇంకా డౌట్ ఎందుకు.. వెనక్కి తగ్గని ‘పెద్ది’

Published: 01-04-2026, 11:05 AM
Peddi : గ్లోబల్ స్టార్ చెప్పిన తర్వాత ఇంకా డౌట్ ఎందుకు.. వెనక్కి తగ్గని ‘పెద్ది’
  • రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల ఖరారు! అభిమానుల్లో ఆనందం.
  • ఏప్రిల్ 30న ‘పెద్ది’ విడుదల అవుతుందని రామ్ చరణ్ ప్రకటన.
  • వాయిదా వార్తలకు చెక్ పెట్టిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.
  • బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రంపై భారీ అంచనాలు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో రామ్ చరణ్ స్వయంగా స్పందించారు.

రామ్ చరణ్ క్లారిటీతో ఫుల్ క్లారిటీ!

Peddi : బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. క్రికెట్, కుస్తీ, విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన సాంగ్స్, గ్లింప్స్ తో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఓ సారి వాయిదా పడి ఏప్రిల్ 30న ఈ సినిమా వస్తుందని చెప్పారు.

అయితే ఇంకా పెద్ది సినిమా షూటింగ్ పూర్తవకపోవడంతో ఇటీవల పెద్ది సినిమా వాయిదా పడుతుందని రూమర్స్ వచ్చాయి. జూన్ లేదా జులై లో పెద్ది వస్తుందని టాలీవుడ్ లో టాక్ నడిచింది. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే తాజాగా పెద్ది రిలీజ్ డేట్ పై రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చారు.

‘పెద్ది’ వాయిదా రూమర్స్‌కు చెక్ పెట్టిన మెగా పవర్ స్టార్

నిహారిక నిర్మాతగా తెరకెక్కిన రాకాస సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్ రామ్ చరణ్ ని కలిశారు. ఆ సినిమా గురించి మాట్లాడుతూ సరదాగా.. పెద్ది లేట్ అవ్వట్లేదు అని కొంచెం బాగా ప్రమోట్ చేయండి. బయట సినిమా వాయిదా పడుతుందని న్యూస్ వింటున్నాను అని అన్నారు. దీంతో పెద్ది సినిమా వాయిదా లేదు చెప్పిన డేట్ కి ఏప్రిల్ 30న వచ్చేస్తుందని క్లారిటీ వచ్చేసింది.

ఏప్రిల్ 30న ‘పెద్ది’ విడుదల.. అభిమానుల్లో ఆనందం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా చెప్పిన తర్వాత ఇంకా డౌట్ ఎందుకు అని ఫ్యాన్స్ పెద్ది కోసం ఎదురుచూస్తున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా ‘పెద్ది’ విడుదల తేదీని ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఏప్రిల్ 30 కోసం ఎదురుచూస్తూ ఉండండి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.