|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్, సుకుమార్ సంచలన నిర్ణయం! హీరోయిన్ విషయంలో ఊహించని ట్విస్ట్!

Published: 10-02-2026, 12:35 AM
రామ్ చరణ్, సుకుమార్ సంచలన నిర్ణయం! హీరోయిన్ విషయంలో ఊహించని ట్విస్ట్!
  • రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో ‘రంగస్థలం’ తర్వాత వస్తున్న సినిమా ఇది.
  • ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో సుకుమార్.
  • హీరోయిన్ విషయంలో అనుపమ పరమేశ్వరన్ పేరు పరిశీలనలో ఉంది.
  • సుకుమార్ గతంలో అనుపమకు అవకాశం ఇస్తానని మాట ఇచ్చారట.

రామ్ చరణ్, సుకుమార్ కలిసి ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. అనుపమ పరమేశ్వరన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

రామ్ చరణ్, సుకుమార్ కాంబో మళ్ళీ వస్తుందా?

Ram Charan-Sukumar: ప్రముఖ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో ‘రంగస్థలం’ సినిమా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతోంది. రంగస్థలం తర్వాత ఇద్దరు కలిసి చేస్తున్న కొత్త సినిమా కథ ఇప్పటికే ఫైనల్ అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్లు సమాచారం.. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ అభిమానులలో అంచనాలు పెంచేసింది. ‘ఆర్య’ , ‘పుష్ప’ తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వచ్చే నెలలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడునుంది అని సమాచారం.

ఇలాంటి సమయంలో ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోబోతున్నారు అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. రంగస్థలం సినిమా సమయంలో మొదట అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్గా తీసుకున్నారు.. కానీ ఆ తర్వాత ఆమెను తప్పించి సమంత(Samantha) ను తీసుకోవడం జరిగింది. అయితే ఈ రంగస్థలం సినిమా సమయంలో అనుపమ పరమేశ్వరన్ విమర్శలు కూడా ఎదుర్కొంది. కావాలనే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని ఎంతోమంది ఈమెపై విమర్శలు గుప్పించారు. దాంతో ఆరు నెలలు అవకాశాలు లేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని ఇటీవల తన సినిమా కిష్కిందపురి ప్రమోషన్స్ లో ఆ రూమర్స్ కి చెక్ పెట్టింది. ఆ సినిమాను తాను వద్దనుకోలేదని వారే కావాలని తనను తప్పించి ఇంకొకరిని తీసుకున్నారు అని..కానీ కొంతమంది ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

హీరోయిన్ రేసులో అనుపమ పరమేశ్వరన్!

కానీ చివరికి సమంత నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇకపోతే ఆ రూమర్స్ ను దృష్టిలో పెట్టుకొని అనుపమాకు తప్పకుండా తన మరో చిత్రంలో ఒక మంచి పాత్రకు అవకాశం ఇస్తానని సుకుమార్ మాటిచ్చారట.. ఆ మాట ప్రకారం ఇప్పుడు రామ్ చరణ్ – సుకుమార్ సినిమా మళ్లీ తెరకెక్కబోతుండడంతో.. ఇటు అనుపమ కూడా వరుస సినిమాలతో లైమ్ లైట్ లో ఉంది కాబట్టి ఈసారి ఆమెకు చాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈమెను తీసుకుంటారా లేదా అనే విషయం తెలియదు.. కానీ సుకుమార్ మాత్రం తన మాట ప్రకారం అనుపమాకు అవకాశం ఇస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

సుకుమార్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా?

అయితే మరోవైపు సుకుమార్ ఈసారి రాసుకున్న కథకు అనుపమ సెట్ అవుతుందో లేదో కూడా చూడాలి.. ఒకవేళ అనుపమ ఆ క్యారెక్టర్ కు సెట్ కాకపోతే మరో హీరోయిన్ ని రంగంలోకి దింపుతారనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి రంగస్థలం సీక్వెల్ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో సమంతను తీసుకుంటారా ?లేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం. ఏదేమైనా ఈ అనుమానాలు అన్నింటికీ తెరపడాలి అంటే వచ్చే నెలలో రామ్ చరణ్ – సుకుమార్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

మొత్తానికి రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో సినిమా వస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. హీరోయిన్ ఎవరనేది చూడాలి. అనుపమకు అవకాశం ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.