|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ దాతృత్వం: 500 మంది నృత్యకారులకు అండగా నిలిచిన మెగా హీరో!

Published: 31-01-2026, 6:35 AM
రామ్ చరణ్ దాతృత్వం: 500 మంది నృత్యకారులకు అండగా నిలిచిన మెగా హీరో!
  • రామ్ చరణ్ 500 మంది డ్యాన్సర్లకు ఉచితంగా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు.
  • డ్యాన్సర్లు ప్రమాదాలకు గురికాకుండా భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
  • ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం రామ్ చరణ్ దాదాపు 50 లక్షలు ఖర్చు చేస్తున్నారు.
  • రామ్ చరణ్ తన తదుపరి సినిమా విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారని సమాచారం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మంచి మనసుతో మరోసారి వార్తల్లో నిలిచారు. 500 మంది డ్యాన్సర్లకు ఉచితంగా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించి వారి పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

డ్యాన్సర్లకు రామ్ చరణ్ అండ

Ramcharan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ram Charan Tej)ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కెరీర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా బిజీగా ఉన్నారు. వృత్తిపరమైన జీవితంలో మాత్రమే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా ఈయన ఎంతో సంతోషంగా ఉండడమే కాకుండా ఎంతో మందికి తనదైన శైలిలోనే సహాయ సహకారాలను అందిస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు . ఇప్పటికే ఎన్నో విధాలుగా సహాయం చేసిన రామ్ చరణ్ తాజాగా డాన్సర్ల పట్ల తన మంచి మనసును చాటుకున్నారు. టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ కి సంబంధించి 500 మంది డ్యాన్సర్లకు ఉచితంగా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు.

గతంలో తన పుట్టినరోజు సందర్భంగా చరణ్ డ్యాన్సర్లకు ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చారని తెలుస్తోంది. సినిమాల షూటింగ్ సమయంలో డాన్సర్లు కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలకు గురి అవుతుంటారు. షూటింగ్స్ లో రిస్క్ తీసుకునే డ్యాన్సర్ల భద్రత కోసం చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. 500 మందికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించడం కోసం చరణ్ సుమారు 50 లక్షలు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. డ్యాన్సర్ల కోసం చరణ్ ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నారనే విషయం తెలిసిన ఆయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

హెల్త్ ఇన్సూరెన్స్ వివరాలు

చిరంజీవి వారసుడిగా సినిమాలలో కొనసాగుతూ సక్సెస్ అందుకోవడమే కాకుండా తండ్రి బాటలోనే ఇతరులకు సహాయం చేయడంలో రామ్ చరణ్ ముందు వరుసలో ఉంటారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక చరణ్ చేసిన సహాయాన్ని పెద్దగా బయట చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు ఆయన ద్వారా లబ్ధి పొందిన వారు బయట పెట్టినప్పుడే మాత్రమే ఇలాంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చరణ్ కెరియర్ విషయానికి వస్తే ఈయన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా అనంతరం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో చరణ్ తన తదుపరి సినిమా పెద్ది విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా మార్చ్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడుతూ మే నెలలో విడుదల కాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా గ్రామీణ క్రీడా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇందులో చరణ్ మాస్ లుక్ లో కనిపించబోతున్నారు.

రామ్ చరణ్ తదుపరి సినిమా

చిరంజీవి బాటలో రామ్ చరణ్ కూడా ఎంతో మందికి సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన చేస్తున్న ఈ మంచి పనుల గురించి అందరూ అభినందిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.