
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న శుభవార్తను మెగా ఫ్యామిలీ దీపావళి సందర్భంగా పంచుకుంది. ఈ వార్తతో మెగా ఫ్యామిలీ, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వైరల్ అవుతున్న వీడియోతో పాటు మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Key Points
రామ్ చరణ్-ఉపాసన దంపతులు మరోసారి పేరెంట్స్ కాబోతున్నారు.
దీపావళి పండుగ సందర్భంగా ఈ శుభవార్తను మెగా ఫ్యామిలీ పంచుకుంది.
మెగా ఫ్యామిలీ శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం వైరల్.
ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో 'పెద్ది' సినిమా చేస్తున్నారు.
మెగా ఫ్యామిలీలో ఆనందం
Ram Charan-Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు మరోసారి పేరెంట్స్(Ram Charan-Upasana) కాబోతున్నారు. దీపావళి పండుగ సందర్బంగా తెలిసి శుభవార్త కావడంతో మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒక వీడియోను విడుదల విడుదల చేసింది మెగా ఫ్యామిలీ. ఈ వీడియోలో మెగా ఫ్యామిలీ రామ్ చరణ్-ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శుభవార్త వీడియో వైరల్
Prabhas-Sukumar: ప్రభాస్-సుకుమార్ కాంబోలో మిస్సైన సినిమా.. వచ్చి ఉంటే డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యేది.. త్వరలోనే..
రామ్ చరణ్ సినిమా విశేషాలు
ఈ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్ సైతం హ్యాపీ ఫీలవుతున్నారు. మెగా వారసుడు రాబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, రామ్ చరణ్-ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటికే రామ్ చరణ్-ఉపాసన దంపతులకు కూతురు క్లింకార ఉన్న విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన దర్శకుడు బుచ్చిబాబు సనాతో “పెద్ది” సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 మార్చ్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రామ్ చరణ్-ఉపాసన దంపతులకు రెండో బిడ్డ రాబోతున్న వార్త మెగా ఫ్యామిలీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. వారి అభిమానులు కూడా ఈ శుభవార్తతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించనున్నారు.


