
📌 Key Points
- మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ ముంబైలో గ్రాండ్‌గా జరిగింది, అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
- చిరంజీవి లీక్ చేసిన డైలాగ్: ‘మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు.. నేను పోరాడాను సారు!’.
- ట్రేడ్ విశ్లేషణ: ‘పెద్ది’కి హిట్ టాక్ వస్తే పాన్ ఇండియా కలెక్షన్ల సునామీ ఖాయం.
- పుష్ప 2 (1600 కోట్లు), ధురంధర్ 2 (1800 కోట్లు) రికార్డులు బ్రేక్ చేస్తుందా? ఉత్కంఠ.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘పెద్ది’ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు! ట్రైలర్ లాంచ్ తో మొదలైన ఈ హంగామా, సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. మరి ‘పెద్ది’ సృష్టించబోయే రికార్డులు ఏంటి? తెలుసుకుందాం!
పెద్ది హంగామా: ట్రైలర్ లాంచ్‌తో మొదలు!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది మూవీ హంగామా మొదలైంది. ముంబై లో నేడు సోమవారం రోజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరగబోతోంది. దీనితో రాంచరణ్ కి సంబంధించిన అంశాలు, పెద్ది విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెద్ది చిత్రం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. జూన్ 4న వరల్డ్ వైడ్ గా పెద్ది చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. పెద్ది మూవీపై కనీ వినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం రాంచరణ్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలుస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ సీన్స్ తో బుచ్చిబాబు ఈ చిత్రాన్ని రూపొందించారట. క్లైమాక్స్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ఉంటుంది అని అంటున్నారు.
చిరంజీవి లీక్ చేసిన డైలాగ్: ఎమోషనల్ డెప్త్!
ట్రైలర్ ని ఆల్రెడీ మీడియాకి, సెలెబ్రెటీలకు ప్రదర్శించారు. చిరంజీవి ట్రైలర్ లోని డైలాగ్ ని కూడా లీక్ చేశారు. ‘మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు.. నేను పోరాడాను సారు’ అనే డైలాగ్ ని చిరంజీవి లీక్ చేశారు. దీనిని బట్టే అర్థం అవుతోంది చరణ్ పాత్రలో ఎంత ఎమోషనల్ డెప్త్, పవర్ ఉందో అని.
పెద్ది సినిమాకు కనుక సూపర్ హిట్ టాక్ వస్తే పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్ల సునామీ ఖాయం అని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. అభిమానుల్లో ఇంకాస్త భారీగా అంచనాలు ఉన్నాయి. పెద్ది చిత్రం తప్పకుండా పుష్ప 2, ధురంధర్ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాల రికార్డులని తుడిచేట్టేస్తుంది అని భావిస్తున్నారు.
రికార్డుల వేట: పుష్ప 2, ధురంధర్ 2 టార్గెట్!
పుష్ప 2 చిత్రం వరల్డ్ వైడ్ గా 1600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ధురంధర్ 2 ఐతే ఏకంగా 1800 కోట్లు రాబట్టింది. ఈ రెండూ సీక్వెల్ చిత్రాలు. వీటికి మొదటి భాగం అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఆ స్థాయిలో కలెక్షన్ రాబట్టాయి. కానీ పెద్ది మూవీకి సీక్వెల్ లేదు. సింగిల్ మూవీగా రిలీజ్ అవుతోంది. అలాంటప్పుడు పుష్ప 2, ధురంధర్ 2 లాంటి చిత్రాలని మించి వసూళ్లు రాబట్టడం అంత ఈజీ కాదు అని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
‘పెద్ది’ విడుదల కోసం అభిమానులు, సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రాంచరణ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి!


