|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ సంచలన ప్రకటన: రాజకీయాలపై మెగా పవర్ స్టార్ షాకింగ్ క్లారిటీ!

Published: 21-05-2026, 5:00 PM
రామ్ చరణ్ సంచలన ప్రకటన: రాజకీయాలపై మెగా పవర్ స్టార్ షాకింగ్ క్లారిటీ!
  • మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజకీయ ప్రవేశంపై సంచలన ప్రకటనతో అభిమానుల్లో తీవ్ర చర్చ.
  • సినిమా రంగంలోనే నెంబర్ వన్ హీరోగా వెలుగొందడమే తన ఏకైక లక్ష్యం అని రామ్ చరణ్ స్పష్టం చేశారు.
  • రాజకీయాలు, సినిమా రెండు పడవలపై ప్రయాణం చేయడం అసాధ్యం. ఇది చాలా కష్టమైన పని అన్నారు.
  • తన తండ్రి చిరంజీవి, బాబాయి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారని గుర్తుచేస్తూ చరణ్ వివరణ.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజకీయ ప్రవేశంపై గత కొన్నాళ్లుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది! అభిమానులకు షాకిస్తూ, తన భవిష్యత్ ప్రణాళికలపై చరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

రాజకీయాలపై రామ్ చరణ్ కుండబద్దలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. పాన్ ఇండియా స్టార్ గా దూసుకు వెళ్తున్నారు. అలాంటి రామ్ చరణ్ లేటెస్ట్ గా బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమా చేశారు. ఈ సినిమా మరో రెండు వారాల్లో రిలీజ్ కానుంది. ఇలాంటి క్రమంలో ప్రమోషన్స్ పైన రామ్ చరణ్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు.

అయితే ఈ సందర్భంగా రాజకీయాల్లోకి రావడంపై రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ఆలోచన తనకు లేదన్నారు. సినిమా ఫీల్డ్ లోనే నెంబర్ వన్ హీరో కావాలనేది తన లక్ష్యం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు? మీరు ముఖ్యమంత్రి అవ్వాలనేది ఫ్యాన్స్ కోరిక అని ఇంటర్వ్యూ చేసే యాంకర్… రామ్ చరణ్ ను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోనని రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చారు. తాను రెండు పడవలపై ప్రయాణం చేయలేనని కుండ బద్దలు కొట్టి చెప్పారు. అది చాలా కష్టమైన పని అంటూ వ్యాఖ్యానించారు. గతంలో తన తండ్రి చిరంజీవి… ప్రస్తుతం బాబాయి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారని స్పష్టం చేశారు.

సినిమాలే నా లోకం: మెగా పవర్ స్టార్

రెండు పడవలపై ప్రయాణం కష్టం!

రామ్ చరణ్ వ్యాఖ్యలతో రాజకీయ ప్రవేశంపై స్పష్టత వచ్చింది. ఆయన సినీ ప్రస్థానంపై అభిమానుల ఆశలు మరింత పెరిగాయి. మరిన్ని ఆసక్తికర అప్‌డేట్స్‌ కోసం మా వెంట ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.