|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ram Gopal Varma: శివ సినిమా చిరంజీవి చేసుంటే.. ప్రతీ సినిమాకు ఇలాగే అడుగుతారు.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..

Published: 09-11-2025, 12:40 PM
Ram Gopal Varma: శివ సినిమా చిరంజీవి చేసుంటే.. ప్రతీ సినిమాకు ఇలాగే అడుగుతారు.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ సినిమా తెలుగు సినిమా రూపురేఖలను మార్చింది. ఇటీవల ఈ సినిమా 4Kలో రీ-రిలీజ్ అవుతున్న సందర్భంగా, ఆర్జీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘శివ’ సినిమాను చిరంజీవి చేసి ఉంటే ఎలా ఉండేదనే ప్రశ్నకు ఆర్జీవీ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు, అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Key Points

1

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'శివ' తెలుగు సినిమా రూపురేఖలను మార్చింది.

2

చిరంజీవి 'శివ' చేసి ఉంటే ఎలా ఉండేదనే ప్రశ్నకు ఆర్జీవీ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

4

'శివ' 4K రీ-రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవీ ఈ వ్యాఖ్యలు చేశారు.

శివ సినిమా: తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయి

Ram Gopal Varma: శివ.. తెలుగు సినిమా రూపురేఖలను మార్చేసిన సినిమా. అప్పటివరకు మూసధోరణిలో వెళుతున్న సినిమా ఇండస్ట్రీకి ఒక చేంజోవర్ తెచ్చిన సినిమా. రియలిస్టిక్ అప్రోచ్ తో, చాలా సహజమైన(Ram Gopal Varma) సన్నివేశాలతో వచ్చిన ఈ సినిమా నిజంగా పాత్ బ్రేకర్ అనే చెప్పాలి. అంతెందుకు, తెలుగు సినిమా ఇండస్ట్రీని శివ సినిమాకి ముందు, శివ సినిమాకు తరువాత అని డివైడ్ చేస్తూ మాట్లాడతారంటే ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉండిఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

Naga Chaitanya: ముంబైలో అలా.. మా ముందు ఇలా.. భార్య గురించి నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్

చిరంజీవి ‘శివ’ చేసి ఉంటే ఆర్జీవీ ఏమన్నారు?

ఆలాంటి సినిమా రాసినందుకు, ఆ సినిమా ఒప్పుకున్నందుకు రామ్ గోపాల్ వర్మ, నాగార్జున ఇద్దరు గ్రేట్ అనే చెప్పాలి. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా శివ సినిమా ఉండేది కాదు. అంతటి బ్లాక్ బస్టర్ సాధించిన ఈ సినిమాను ఇప్పుడు 4Kలో రీ రిలీజ్ కానుంది. ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

నాగార్జున పాత్రకు సరైన ఎంపిక ఎందుకు?

ఈ సందర్బంగా యాంకర్.. శివ సినిమా హిట్‌ తరువాత ‘చిరంజీవి’ మ్యాగజైన్‌లో ఈ సినిమా నాగార్జున కాకుండా చిరంజీవి చేస్తే ఎలా ఉండేది అనే శీర్షికతో ఓ స్టోరీ వచ్చింది. నేను ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా.. నిజంగానే చిరంజీవి శివ సినిమా చేసుంటే ఎలా ఉండేదో చెప్పండి అని అడిగాడు. దానికి సమాధానంగా ఆర్జీవీ.. అప్పుడే కాదు ఇప్పుడు కూడా చాలా సినిమాలు హిట్‌ అయినప్పుడు ఇదే సినిమాను పెద్ద హీరోతో చేస్తే ఎలా ఉండేది అని అడుగుతూ ఉంటారు. శివ అనే పాత్రకు నాగార్జున సెట్‌ అయ్యాడు కాబట్టే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అదే సినిమా చిరంజీవి చేసుంటే ఎలా ఉండేదో చెప్పలేం” అంటూ చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. దీంతో ఆయన చేసిన ,కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మొత్తం మీద, ‘శివ’ సినిమాకి నాగార్జున సరైన ఎంపికని, అప్పటి ప్రశ్నలకు, ఇప్పటి చర్చలకు ఆర్జీవీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలు సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.