
📌 Key Points
- రామ్ పోతినేని నటించిన చివరి చిత్రం ఆంధ్రా కింగ్ ఆశించిన ఫలితం ఇవ్వలేదు.
- రామ్ ఇప్పుడు విభిన్నమైన కథలపై దృష్టి పెడుతున్నట్లు సమాచారం.
- క్రేజీ డైరెక్టర్ కిషోర్ తిరుమలతో రామ్ సినిమా చేసే అవకాశం ఉంది.
- ఆర్కా మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని తన తదుపరి సినిమా కోసం సరికొత్తగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈసారి ఒక క్రేజీ డైరెక్టర్ తో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
హిట్ కోసం రామ్ ప్రయత్నాలు
Ram Pothineni : టాలీవుడ్ ఎనర్జిటిక్ సార్ రామ్ పోతినేని ఖాతాలో సరైన హిట్ సినిమా పడలేదు. ఆయన నటించిన రీసెంట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే నెక్స్ట్ చేస్తున్న ప్రాజెక్టుల కథల విషయంలో రామ్ కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో వరుసగా ఆయన కథలను వింటున్నాడు. అయితే రామ్ ప్రస్తుతం తన రూటు మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఈసారి యాక్షన్ సినిమాలు కాకుండా డిఫరెంట్ జోనర్ లో సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ క్రమంలో ఆయన ఓ క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఎలాంటి జోనల్లో సినిమా రాబోతుంది. అన్నది ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ హీరో రామ్ గతంలో నటించిన క్రేజీ ప్రాజెక్ట్ నేను శైలజ.. రామ్ కెరీర్ లోనే మంచి ఫీల్ గుడ్ మూవీ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మరోసారి రామ్ కెరీర్ రిస్క్ లో పడింది.. అయితే ఈసారి కిషోర్ తిరుమల కు ఒక ఛాన్స్ ఇవ్వాలని డైరెక్టర్ రామ్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరు కాంబోలో ఓ సినిమాని ప్రేక్షకులు చూడాలని అనుకుంటున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. కచ్చితంగా ఈసారి కూడా కం బ్యాక్ ఇస్తాడని బలమైన నమ్మకం తో ఉన్నారు రామ్ ఫ్యాన్స్.. ఈ డైరెక్టర్ రీసెంట్ గా మాస్ మహారాజా రవితేజ తో భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా చేశారు. మూవీ పెద్దగా హిట్ అవ్వకపోయినా కొంతలో కొంత బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఇప్పుడు వీరిద్దరు కాంబోలో సినిమా అంటే అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఈ మూవీ గురించి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
క్రేజీ డైరెక్టర్ తో సినిమా?
ఆర్కా మీడియా నిర్మాణంలో సినిమా?
హీరో రామ్ ఈమధ్య ఏ సినిమా చేసిన కూడా అతనికి బిగ్గెస్ట్ వీటిని ఒక్క సినిమా కూడా అందించలేదు. రీసెంట్ గా వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కూడా అతనికి పెద్దగా హిట్ అందించలేదు. అయితే ఇప్పటికే రామ్ పలువురు డైరెక్టర్ల తో సంప్రదించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రామ్ ఈసారి యాక్షన్ సినిమాలు కాకుండా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాహుబలి మేకర్స్ ఆర్కా మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది అనే వార్త ఇప్పటికే ప్రచారంలో ఉంది. దీనిపై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. అయితే ఆ మధ్య రామ్ ఈ సినిమా గురించి సంప్రదించినట్లు సమాచారం. అతి త్వరలోనే ఈ మూవీ గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది..
మొత్తానికి రామ్ పోతినేని తన తదుపరి సినిమాతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి. కొత్త దర్శకుడితో సినిమా చేస్తే ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.


