
📌 Key Points
- రామాయణంలో రాముడిగా రణబీర్ కపూర్ రూ.75 కోట్లు తీసుకుంటున్నారు.
- రావణాసురుడిగా యష్ రూ.50 కోట్లు, సీతగా సాయి పల్లవి రూ.6 కోట్లు పారితోషికం.
- హనుమంతుడిగా సన్నీ డియోల్ రూ.20 కోట్లు, లక్ష్మణుడిగా రవి దుబే రూ.4 కోట్లు తీసుకుంటున్నారు.
- ఇతర నటీనటులు కూడా వారి పాత్రలకు భారీగానే పారితోషికం అందుకుంటున్నారు.
రామాయణం సినిమా కోసం నటీనటులు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ వంటి నటులు ఎంత పారితోషికం తీసుకుంటున్నారో చూద్దాం.
రాముడిగా రణబీర్ కపూర్ పారితోషికం
Ramayana:రామాయణ ఇతిహాస గాథలు తెరపై ఎన్నిసార్లు వచ్చినా ప్రతి సినిమా కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈసారి ఏకంగా కనీవినీ ఎరుగని రీతిలో హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోకుండా రూ.4000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ స్టార్ హీరో యష్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల టీజర్ విడుదల అవ్వగా.. దేశవ్యాప్తంగా ఇది మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ విజువల్ వండర్ గా మలుస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా ఈ టీజర్ అటు దేశవ్యాప్తంగా అంచనాలు పెంచిన నేపథ్యంలో ఎవరు ఈ సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ సినిమాలో నటిస్తున్న సెలబ్రిటీలు ఎవరు? ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు ? తమ పాత్ర కోసం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంత? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
రావణుడిగా యష్ అందుకుంటున్న మొత్తం
రామాయణంలో అత్యంత కీలక పాత్ర అయిన శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.ఈయన తన పాత్రకు గానూ రూ..75 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. లంక యోధుడు రావణాసురుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్నారు. ఈయన తన పాత్ర కోసం రూ.50 కోట్లు తీసుకుంటున్నారు. శ్రీరాముడి సతీమణి సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుండగా.. ఆమె ఈ పాత్ర కోసం రూ.6కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అలాగే హనుమాన్ పాత్ర పోషిస్తున్న సన్నీ డియోల్ రూ.20 కోట్లు, లక్ష్మణ్ పాత్ర పోషిస్తున్న రవి దుబే రూ.4 కోట్లు, రావణ భార్య మండోదరి భార్య పోషిస్తున్న కాజల్ అగర్వాల్ రూ.1కోటి, రావణ సోదరి సూర్పనఖ పాత్ర పోషిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ రూ.1.2కోట్లు , సుమంత్ర పాత్ర పోషిస్తున్న సత్యేన్ చతుర్వేది రూ.70 లక్షలు, దశరథ మూడవ భార్య కైకేయి పాత్ర పోషిస్తున్న లారాదత్త రూ.25 లక్షలు, దశరథ పాత్ర పోషిస్తున్న అరుణ్ గోవింద్ రూ.90 లక్షలు, ఇంద్ర దేవ్ పాత్ర పోషిస్తున్న కునాల్ కపూర్ రూ.30 లక్షలు, రావణ సోదరుడు విభీషణ పాత్ర పోషిస్తున్న వివేక్ ఒబెరాయ్ రూ.75 లక్షలు, దశరథ భార్య కౌసల్య పాత్ర పోషిస్తున్న ఇందిరా కృష్ణన్ రూ.65 లక్షలు, మందిర పాత్ర పోషిస్తున్న సిబా చద్దా రూ.40 లక్షలు, కైకాశి పాత్ర పోషిస్తున్న శోభన రూ.20 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలవడాల్సి ఉంది.
ఇకపోతే 4వేల కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటీనటులకు చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తూ బడ్జెట్ మొత్తాన్ని సినిమా కోసమే కేటాయిస్తూ ఉండడం గమనార్హం.. ఇకపోతే రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామాయణ మొదటి భాగాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నారు.
మిగిలిన నటీనటుల రెమ్యూనరేషన్ వివరాలు
మొత్తానికి రామాయణం సినిమా కోసం నటీనటులు భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నారు. ఈ చిత్రం విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

