|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రూ. 600 టికెట్ పెట్టినా ‘పెద్ది’కి దిక్కులేని బుకింగ్స్! మెగాస్టార్ సినిమాకు ఈ దౌర్భాగ్యమా?

Published: 02-06-2026, 5:00 PM
రూ. 600 టికెట్ పెట్టినా ‘పెద్ది’కి దిక్కులేని బుకింగ్స్! మెగాస్టార్ సినిమాకు ఈ దౌర్భాగ్యమా?
  • ‘పెద్ది’ విడుదల ముందర అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం ట్రేడ్ వర్గాలకు షాక్.
  • ఏపీ ప్రభుత్వం రూ. 600 స్పెషల్ ప్రీమియర్ టికెట్, అదనపు రేట్లకు అనుమతిచ్చింది.
  • రేట్లు పెంచినా, బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం మేకర్స్ అసమర్థతను చూపిస్తోంది.
  • మైత్రీ మూవీ మేకర్స్ థియేటర్ ఒప్పందాలలో విఫలమైందని విమర్శలు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల ముందర ట్రేడ్ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఏపీలో రూ. 600 టికెట్ రేటు పెంచినా, బుకింగ్స్ ఓపెన్ కాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టికెట్ రేట్ల పెంపు.. అయినా బుకింగ్స్ లేవు!

Peddi Release : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ విడుదల ముందర ట్రేడ్ వర్గాల్లో ఫుల్ డిసప్పాయింట్ ని మిగులుస్తోంది. వస్తున్న అప్ డేట్స్,చేస్తున్న ప్రమోషన్స్ చూస్తుంటే పెద్దిపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి, కానీ మేకర్స్ ప్లానింగ్ లోపాలు, డిస్టిబ్యూటర్ ల వైఫల్యాల వల్ల సినిమా బిజినెస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలేలా కనిపిస్తోంది.

జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుందని ప్రచారం చేస్తున్నా, విడుదలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం ట్రేడ్ వర్గాలకు పెద్ద షాక్ నే ఇస్తుంది. గతంలో ప్రభాస్ ‘సలార్’ లేదా జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రాల విడుదలకు వారం రోజుల ముందే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోగా, ‘పెద్ది’ సినిమాకు మాత్రం చివరి నిమిషంలోనూ థియేటర్ల దగ్గర సైలెన్స్ కనిపిస్తుంది.

మేకర్స్ అసమర్థత, డిస్ట్రిబ్యూటర్ల వైఫల్యం

పూర్తి స్థాయిలో ఓపెన్ కాకపోవడం మేకర్స్ అసమర్థత

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చిత్రానికి భారీగా రేట్లు పెంచుకునేందుకు మూడు రోజుల క్రితమే అనుకూలమైన జీవో ఇచ్చింది. జూన్ 3న బుధవారం సాయంత్రం పడే స్పెషల్ ప్రీమియర్ షోలకు ఏకంగా రూ. 600 టికెట్ ధర పెట్టుకునేలా, జూన్ 4 నుండి 13వ తేదీ వరకు రోజుకు 6 షోలతో పాటు సింగిల్ స్క్రీన్లలో రూ. 100, మల్టీప్లెక్సుల్లో రూ. 125 అదనంగా వసూలు చేసుకునేలా అనుమతి ఇచ్చింది. దీనివల్ల సాధారణంగా ఉండే రూ. 50 నేల క్లాస్ టికెట్ ధర మొదటి పది రోజులు రూ. 150 కానుంది. అలాగే మల్టీప్లెక్స్ లలో కనీస టికెట్ ధర రూ. 400 దాటనుంది. సాధారణ ప్రేక్షకుడి జేబుకు చిల్లు పెట్టేలా ఉన్న ఈ రేట్లకు తోడు, ప్రీమియర్ షోలకు 24 గంటల సమయం కూడా లేని సమయంలో ఇప్పటికీ ‘బుక్ మై షో’ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ లో బుకింగ్స్ పూర్తి స్థాయిలో ఓపెన్ కాకపోవడం మేకర్స్ అసమర్థతను చూపిస్తోంది. ఏపీలో ఇంత పెద్ద లీగల్ సపోర్ట్ ఉన్నా థియేటర్ ఓనర్స్ తో అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడంలో మైత్రీ మూవీ మేకర్స్ ఘోరంగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుమారు రూ. 10 కోట్ల వరకు భారీ నష్టం

నైజాంలోనూ అదే సస్పెన్స్, భారీ నష్టం

మొత్తంగా, ‘పెద్ది’ సినిమా విడుదల ముందర ఎదుర్కొంటున్న ఈ సమస్యలు మేకర్స్ ప్లానింగ్ లోపాలను స్పష్టంగా చూపిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా భవిష్యత్తుపై ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.