
📌 Key Points
- రణ్‌బీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా అదరగొట్టేందుకు సిద్ధం!
- ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణం టీజర్ విడుదల!
- రావణాసురుడిగా కన్నడ సూపర్ స్టార్ యష్.. భారీ అంచనాలు!
- 2 నిమిషాల 30 సెకన్ల టీజర్.. హాలీవుడ్ స్థాయి విజువల్ వండర్!
బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో రామాయణం సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రణ్‌బీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అప్డేట్ వచ్చేసింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
హనుమాన్ జయంతికి టీజర్ విడుదల!
Ramayana: బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ చిత్రం భారతీయ సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నడ సూపర్ స్టార్ యష్ రావణాసురుడిగా నటిస్తుండటం ఈ ప్రాజెక్టుకు మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించిన విషయం తెలిసిందే.
రాముడిగా రణ్‌బీర్.. సీతగా సాయి పల్లవి లుక్స్ అదుర్స్!
తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్బంగా రామాయణ(Ramayana) టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతోంది. సుమారు 2 నిమిషాల 30 సెకన్ల నిడివితో రానున్న ఈ టీజర్ ఒక విజువల్ వండర్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన సెట్టింగ్స్, పాత్రల పరిచయంతో ఈ టీజర్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుందట. ముఖ్యంగా రణబీర్ కపూర్ శ్రీరాముడి గెటప్, సాయి పల్లవి సీత లుక్ టీజర్ కె హైలెట్ కానున్నాయట.
రావణుడిగా యష్.. అంచనాలు ఆకాశాన్ని తాకేలా!
భారీ బడ్జెట్‌తో, ఇండియా లెవల్లో ఉన్న స్టార్ యాక్టర్స్ కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ పురాణ ఇతిహాసాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. హనుమాన్ జయంతి రోజున రాబోయే ఈ అప్డేట్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా 2026 దివాలి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
రామాయణం టీజర్ విడుదల తేదీ ఖరారు కావడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


