|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామాయణానికి జపాన్ షాక్: రణ్‌బీర్, సాయి పల్లవి మూవీకి భారీ ముప్పు!

Published: 15-04-2026, 1:05 PM
రామాయణానికి జపాన్ షాక్: రణ్‌బీర్, సాయి పల్లవి మూవీకి భారీ ముప్పు!
  • రణ్‌బీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా ‘రామాయణం’ మూవీలో నటిస్తున్నారు!
  • యష్ రావణుడిగా.. నితీష్ తివారీ దర్శకత్వంలో భారీగా రూపొందుతున్న చిత్రం!
  • దీపావళికి విడుదల కానున్న ‘రామాయణం’ మూవీకి జపాన్ ‘గాడ్జిల్లా’ నుండి పోటీ!
  • ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదల కానుండటంతో థియేటర్ల కొరత ఏర్పడే అవకాశం!

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘రామాయణం’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమాకు ఒక ఊహించని అడ్డంకి ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రామాయణం మూవీలో స్టార్ నటులు!

రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీత పాత్రలో రూపొందుతున్న చిత్రం రామాయణ. కన్నడ స్టార్ నటుడు యాష్ ఇందులో రావణుడిగా కనిపించబోతున్నాడు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగాన్ని ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని ఐమాక్స్ ఫార్మాట్‌లో రూపొందిస్తున్నారు.

గాడ్జిల్లాతో రామాయణానికి పోటీ?

దాంతో పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని ఐమాక్స్ థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ అందుకు సంబంధించిన పనులను పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఈ మూవీకి ఓ జపాన్ చిత్రం నుండి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2023లో విడుదలైన గాడ్జిల్లా మైనస్ వన్ ఏ స్థాయి ఇంపాక్ట్‌ను బాక్సాఫీస్ వద్ద చూపించిందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా గాడ్జిల్లా మైనస్ జీరో అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఐమాక్స్ థియేటర్ల సమస్య!

ఈ సినిమాను నవంబర్ 6న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని కూడా ఐమాక్స్ ఫార్మాట్‌లోనే రూపొందించారు. ఈ మూవీని కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఐమాక్స్ థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే గానీ జరిగితే, ఈ రెండు చిత్రాల విడుదల తేదీలు దగ్గరగా ఉండడం వల్ల రామాయణ చిత్రానికి ఐమాక్స్ థియేటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని, అలా జరిగితే అది ఈ చిత్ర కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రామాయణం మూవీ విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా ఆసక్తికరమైన వార్త. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.