|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రమ్య మోక్ష రెండు వారాల పారితోషికం ఎంతో తెలుసా, సెలబ్రిటీ రేంజ్‌.. ఎలిమినేషన్‌తో బిగ్‌ బాస్‌ ఫ్యాన్స్ పండగ

Published: 26-10-2025, 10:53 AM
రమ్య మోక్ష రెండు వారాల పారితోషికం ఎంతో తెలుసా, సెలబ్రిటీ రేంజ్‌.. ఎలిమినేషన్‌తో బిగ్‌ బాస్‌ ఫ్యాన్స్ పండగ

బిగ్‌ బాస్ తెలుగు 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన రమ్య మోక్ష, అంచనాలను అందుకోలేక ఏడో వారంలో ఎలిమినేట్ అయ్యింది. ఆమె రెండు వారాల పారితోషికం ఎంత? హౌస్‌లో ఆమె ప్రదర్శన ఎలా ఉంది? ఆమె ఎలిమినేషన్‌పై బిగ్‌ బాస్‌ ఫ్యాన్స్ ఎందుకు పండగ చేసుకుంటున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.

Key Points

1

రమ్య మోక్ష వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌస్‌లోకి ఎంట్రీ.

2

ప్రారంభంలో హడావుడి చేసినా, ఆ తర్వాత కంటెంట్ ఇవ్వడంలో విఫలం.

4

ఏడో వారం ఎలిమినేషన్ తర్వాత ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రమ్య మోక్ష వైల్డ్ కార్డ్ ఎంట్రీ, హడావుడి

అలేఖ్య పికిల్స్ అమ్మాయి రమ్య మోక్ష వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రారంభంలోనే ఆమె పేరు వినిపించినా ఫస్ట్ రాలేదు. కానీ ఐదో వారం నిర్వహించిన వైల్డ్ కార్డ్ లో భాగంగా ఆమె కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమెతోపాటు దివ్వెల మాధురి, అయేషా జీనత్‌, నిఖిల్‌ నాయర్‌, గౌరవ్ గుప్తా, శ్రీనివాసా సాయి వైల్డ్ కార్ద్ ద్వారా హౌజ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రారంభంలో రమ్య మోక్ష హడావుడి చేసింది. బయట ఏం జరుగుతుందో, బిగ్‌ బాస్‌ షోపై ఎలాంటి అభిప్రాయం ఉందో, అలాగే కంటెస్టెంట్లపై ఆడియెన్స్ ఏం ఫీలవుతున్నారో వారికి చెప్పింది. మొత్తంగా గాసిప్‌ రాణిగా మారిపోయింది. ప్రారంభంలో రెండు మూడు రోజులు అదే పనిచేసింది.

దీంతోపాటు టాస్క్ ల్లో కాస్త హడావుడి చేసింది. తన కండలు, గ్లామర్‌ అంతా మొదటి రెండుమూడు రోజులకే పరిమితమయ్యింది. ఆ తర్వాత పప్పులా మారిపోయింది. ఏమాత్రం హడావుడి లేదు, కంటెంట్ లేదు. గుసగుసలు తప్ప ఏం చేయడం లేదు. గట్టిగా టాస్క్ లు కూడా ఆడటం లేదు. ఎంటర్‌టైన్‌మెంట్స్ విషయంలో జీరో అయిపోయింది. దీంతో ఆమెపై ఆడియెన్స్ పెట్టుకున్న నమ్మకం అంతా తలక్రిందులైంది. అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ సమయంలో రమ్య బోల్డ్ గా రియాక్ట్ దుమ్ములేపిన విషయం తెలిసిందే. దీనికితోడు ఇన్‌ స్టాగ్రామ్‌లో జిమ్‌ వీడియోలతో సందడి చేసింది. ఆమె ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్, పోజులు చూసి కుర్రాళ్లకి మతిపోయింది. ఇక ఆమె బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వస్తే రచ్చ వేరే లెవల్‌లో ఉంటుందని భావించారు. కానీ ఆమె అందరి ఆశలపై నీళ్లు చల్లింది.

హౌస్‌లో ఆమె ప్రదర్శన, ప్రేక్షకుల నిరాశ

మొదటి వారంలో అంతో ఇంతో బాగానే హడావుడి కనిపించింది. రెండో వారం మరింత డల్‌ అయ్యింది. ఏమాత్రం కంటెంట్‌ ఇవ్వడం లేదు. దీంతో బిగ్‌ బాస్‌ ఫ్యాన్స్ ని మరింతగా డిజప్పాయింట్‌ చేసింది. ఈ నేపథ్యంలో చివరికి ఆమె ఎలిమినేషన్‌ కావాల్సి వచ్చింది. ఏడో వారం రమ్య మోక్ష ఎలిమినేట్‌ అయ్యింది. శనివారమే ఆమె ఎలిమినేషన్‌ పూర్తయ్యింది. శనివారం రాత్రి హోటల్‌కి తీసుకెళ్లారు. దీంతో బిగ్‌ బాస్‌ ఫ్యాన్స్, ఆమెపై ఆశలు పెట్టుకున్న వాళ్లంతా హ్యాపీ అవుతున్నారు. ఆమె ఎలిమినేషన్‌ మంచే జరిగిందని, ఇది నిజమైన పండగ అంటున్నారు. దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. వెళ్లి పచ్చళ్లు పెట్టుకోవాలని సెటైర్లు పేలుస్తున్నారు. అంతేకాదు కెరీర్‌ని సీరియస్‌గా తీసుకున్నా అన్నావ్‌గా, ఇదేనా అంటూ మరింతగా రెచ్చగొడుతున్నారు.

రమ్య మోక్ష ఎలిమినేషన్‌ విషయంలో చాలా మంది హ్యాపీగా ఫీలవడం గమనార్హం. దీంతో ఆమెపై ఆడియెన్స్ లో ఎంత నెగటివిటీ ఉందో అర్థమవుతుంది. హౌజ్‌లోకి వెళ్లి పుల్లలు పెట్టడం తప్ప ఏం చేయలేదంటూ, ఇలాంటి వాళ్లని నిర్వాహకులు ఎలా బిగ్‌ బాస్‌కి తీసుకొస్తారని కామెంట్‌ చేస్తున్నారు. దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. దీంతో ఇప్పుడిది ఇంటర్నెట్‌లో పెద్ద రచ్చ రచ్చ అవుతుంది.

ఏడో వారం ఎలిమినేషన్, అభిమానుల పండగ

వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన రమ్య మోక్షకి  పారితోషికం ఎంత?. రెండు వారాలకు గానూ ఆమెకి ఎంత ఇవ్వనున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఆమెకి సెలబ్రిటీ రేంజ్‌లో పారితోషికం ఇచ్చారట. వారానికి రెండు నుంచి మూడు లక్షల వరకు ఇచ్చినట్టు టాక్. అంటే రెండు వారాలకు సుమారు నాలుగు నుంచి, ఐదు లక్షల వరకు పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇది సెలబ్రిటీ రేంజ్‌ అనే చెప్పాలి. కామనర్స్ కి వారానికి  లక్షన్నర లోపే పారితోషికం ఉంది. వారితో పోల్చితే రమ్యకి డబుల్‌ ఇచ్చినట్టే అవుతుంది. అదే స్థాయిలో ఆమెనుంచి కంటెంట్‌ని ఆశించారు బిగ్‌ బాస్‌ నిర్వాహకులు. కానీ వారి అంచనాలన్నీ తలక్రిందులు కావడంతో వెంటనే ఎలిమినేట్‌ చేసినట్టు సమాచారం. ఆమె ఎలిమినేషన్‌ని ఆదివారం ఎపిసోడ్‌లో చూపించబోతున్నారు.

మొత్తంగా, రమ్య మోక్ష బిగ్‌ బాస్‌ ప్రయాణం ఆడియెన్స్‌ను నిరాశపరిచింది. ఒక సెలబ్రిటీ రేంజ్‌ పారితోషికం తీసుకున్నా, ఆమె హౌస్‌లో ప్రభావం చూపలేకపోయింది. ఆమె ఎలిమినేషన్‌తో అభిమానులు పండగ చేసుకుంటున్నారంటే ఆమె ఆట ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.