
📌 Key Points
- రామాయణం సినిమాలో శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటించనున్నారు.
- ముందుగా ఈ సినిమాను రణబీర్ రిజెక్ట్ చేయడానికి కారణం తనలో ఆత్మవిశ్వాసం లేకపోవడం.
- కుమార్తె పుట్టిన తర్వాత రణబీర్ మనసు మార్చుకుని సినిమాలో నటించడానికి అంగీకరించారు.
- ఈ సినిమాలో సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యష్ నటిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ మొదట రామాయణం సినిమాను రిజెక్ట్ చేశారు. తనలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే దీనికి కారణం. అయితే, కుమార్తె పుట్టిన తర్వాత ఆయన మనసు మార్చుకున్నారు. ఈ సినిమాలో శ్రీరాముడిగా కనిపించనున్నారు.
రణబీర్ కపూర్ రిజక్షన్ వెనుక అసలు కారణం
Ranbir Kapoor: రణబీర్ కపూర్ పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక రణబీర్ కపూర్ ప్రస్తుతం రామాయణ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం 2026 దీపావళి పండుగ సందర్భంగా విడుదల కాబోతోంది అలాగే రెండో భాగం 2027 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించి ఒక గ్లింప్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ రెండో తేదీ ఈ వీడియోని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పలు ఇంటర్వ్యూలలో చిత్ర బృందం పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే నటుడు రణబీర్ కపూర్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. డైరెక్టర్ నితీష్ తివారి ఈ సినిమా కథ తనకు చెప్పినప్పుడు మొదట్లో రిజెక్ట్ చేసానని రణబీర్ కపూర్ తెలిపారు. ఇలా ఈ సినిమా రిజెక్ట్ చేయడానికి గల కారణాలను కూడా ఈయన ఈ సందర్భంగా తెలియజేశారు.
ఆత్మవిశ్వాసంతో రణబీర్ నిర్ణయం మార్పు
ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నారు శ్రీరాముడి పాత్రలో కనిపించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి పాత్రలో నేను చేయగలనా? ఒకవేళ చేసిన ఈ పాత్రకు న్యాయం చేయగలనా? అనే ఆత్మవిశ్వాసం నాలో లేకపోవడంతో మొదట్లో ఈ కథ రిజెక్ట్ చేశానని రణబీర్ తెలిపారు. ఇక తన కుమార్తె పుట్టిన తర్వాత భయం కాస్త కృతజ్ఞతగా మారడంతో నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుని ఈ సినిమాకు ఓకే చెప్పానని రణబీర్ కపూర్ తెలిపారు. ఇలా భయం ఆత్మవిశ్వాసం లేకపోవడంతోనే రిజెక్ట్ చేశానంటూ రణబీర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈయన శ్రీరాముడి పాత్రలో నటించబోతున్నట్లు ప్రకటించడంతో ఎన్నో విమర్శలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై కూడా చిత్ర బృందం స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ఈయన శ్రీరాముడి పాత్రలో కనిపించగా సీత పాత్రలో సాయి పల్లవి కనిపించబోతున్నారు. ఇక రావణాసురుడిగా యష్ నటించబోతున్న సంగతి తెలిసిందే. నితీష్ తివారి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా సుమారు నాలుగువేల కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్,మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ పై నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2వ తేదీ విడుదల చేయబోయే గ్లింప్స్ లో భాగంగా ఈ సినిమాలో నటీనటుల పాత్రలను పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
రామాయణంలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు
రణబీర్ కపూర్ తన భయాన్ని జయించి శ్రీరాముడి పాత్రలో నటించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విడుదల కోసం ఎదురుచూద్దాం.


