|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రణబీర్ ‘రామాయణం’ ఫస్ట్ లుక్ విడుదల తేది ఫిక్స్! హనుమాన్ జయంతికి రాముడి దర్శనం!!

Published: 27-03-2026, 5:05 AM
రణబీర్ 'రామాయణం' ఫస్ట్ లుక్ విడుదల తేది ఫిక్స్! హనుమాన్ జయంతికి రాముడి దర్శనం!!
  • రణబీర్ కపూర్ ‘రామాయణం’ ఫస్ట్ లుక్ ఏప్రిల్ 2న విడుదల
  • హనుమాన్ జయంతి సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు నిర్మాత ప్రకటన
  • ఈ చిత్రంలో రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు
  • దాదాపు 4 వేల కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు

రణబీర్ కపూర్ నటిస్తున్న ‘రామాయణం’ చిత్రం ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న ఫస్ట్ లుక్ విడుదల కానుంది.

రామాయణం ఫస్ట్ లుక్ విడుదల తేదీ ప్రకటన

Ramayana Firstlook: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో నితీష్ తివారీ దర్శకత్వంలోని ‘రామాయణం’ ఒకటి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. తాజాగా ఈ నిరీక్షణకు తెరదించుతూ చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా కీలక ప్రకటన చేశారు. దీనికి సంబంధించి రామ నవమి రోజున రాముడి ఫస్ట్ లుక్ విడుదల తేదీని ప్రకటించారు.

Read also- Ram Charan Birthday Special:హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్

శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఈ అప్‌డేట్‌ను పంచుకుంది. హనుమాన్ జయంతి (ఏప్రిల్ 2) సందర్భంగా రణబీర్ కపూర్ ‘శ్రీరాముడి’ ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత ధృవీకరించారు. “ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి నాడు మేమంతా కలిసి మొదటి అడుగు వేస్తున్నాము” అని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. దీంతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎనైన్స్ మెంట్ రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటన

ఈ ప్రాజెక్ట్ గురించి నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. “రామాయణం అనేది మనందరికీ సంబంధించిన కథ. దీనిని వెండితెరపై ఆవిష్కరించేటప్పుడు మాపై ఎంతో బాధ్యత ఉంది. అత్యంత భక్తితో, శ్రద్ధతో, మన రామాయణాన్ని దాని అసలైన ఆత్మ దెబ్బతినకుండా భారీ స్థాయిలో రూపొందిస్తున్నాము. ఇన్నేళ్ల మా కృషిని అభిమానుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాము” అని తెలిపారు. దీనికి సంబంధించి నోట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా కనిపిస్తుండగా, టాలెంటెడ్ నటి సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తోంది. కన్నడ స్టార్ యష్ రావణుడిగా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక సాంకేతిక విలువల(VFX)తో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. దాదాపు నాలుగు వేల కోట్లు వరకూ అవుతుందని అంచనా.

భారీ బడ్జెట్‌తో రామాయణం చిత్రం

Read also- YouTube No Ads: యూట్యూబ్‌ ధమాకా ఆఫర్.. యాడ్స్ లేకుండా 60 రోజుల వరకు వీడియోస్ ఫ్రీ.. ఇలా యాక్టివేట్ చేయండి

కేవలం భారత్‌లోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను ప్రమోట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా అమెరికాలో కూడా భారీ ఈవెంట్లను నిర్వహించనున్నారు. రణబీర్ కపూర్, నితీష్ తివారీ ఈ నెల చివర్లో అంతర్జాతీయ మీడియా సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ అద్భుత కావ్యాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగం 2026 దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రెండవ భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి, ఏప్రిల్ 2న రానున్న రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్ సినిమాపై ఉన్న అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తోంది.

రణబీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. హనుమాన్ జయంతి రోజున విడుదల కాబోయే ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.