|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రంగస్థలం ఫస్ట్‌ నాకే ఆఫర్‌ చేశారు.. నేనే రిజెక్ట్‌ చేశా: ఆర్కే సాగర్‌

Published: 09-07-2025, 2:17 AM
రంగస్థలం ఫస్ట్‌ నాకే ఆఫర్‌ చేశారు.. నేనే రిజెక్ట్‌ చేశా: ఆర్కే సాగర్‌

నటుడు ఆర్కే సాగర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, ‘రంగస్థలం’ సినిమాలో నటించే అవకాశాన్ని తాను తిరస్కరించానని వెల్లడించారు. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా అనుభవం ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని చెప్పారు.

Key Points

1

ఆర్కే సాగర్ 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాలోని తన పాత్రతో అసంతృప్తి చెందారు.

2

'రంగస్థలం' సినిమాలో నటించే అవకాశాన్ని ఆయన తిరస్కరించారు.

4

ఆయన తన తప్పుల నుండి నేర్చుకుని, మంచి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు.

మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా అనుభవం

నేను చేసిన తప్పు ఆర్కే సాగర్‌ ( R.K. Sagar ) హీరోగా నటించిన తాజా చిత్రం ది 100. సైబర్‌ క్రైమ్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి రాఘవ్‌ ఓంకార్‌ శశిధర్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జూలై 11న రిలీజ్‌ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు సాగర్‌ . ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా లైఫ్‌లో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ సినిమా చేయడం నేను చేసిన తప్పు. మొగలిరేకులు సీరియల్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ మూవీ ( Mr Perfect Movie )లో ఛాన్స్‌ వచ్చింది.

15 రోజులు డేట్స్‌ ఇచ్చా.. అందులో సెకండ్‌ లీడ్‌ నాదే అన్నారు. పెద్ద బ్యానర్‌ అని ఒప్పుకున్నాను. అప్పటివరకు నాకు సినిమాలపై పెద్దగా అవగాహన లేదు. సీరియల్‌ టీమ్‌ను ఎలాగోలా ఒప్పించి మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ టీమ్‌కు 15 రోజులు డేట్స్‌ ఇచ్చాను. మొదటి మూడురోజులు నాకు షూటింగ్‌ లేదు. అనుమానం వచ్చి డైరెక్టర్‌ దశరథ్‌ను అడిగితే రేపు నీ సీన్‌ ఉంటుందన్నాడు. అలా నాపై రెండు మూడు సీన్లు తీశారు.

రంగస్థలం ఆఫర్ మరియు నిర్ణయం

చాలా డిసప్పాయింటయ్యా సెకండ్‌ లీడ్‌ అని వెళ్తే.. అక్కడంతా రివర్స్‌లో జరుగుతోందనిపించింది. నాకు చెప్పిన క్యారెక్టర్‌ ఇది కాదు కదా అనిపించింది. అదే విషయం నిలదీశాను. అసలు నాది సెకండ్‌ లీడేనా? అని అడిగాను. అందుకాయన.. అప్పుడప్పుడు క్యారెక్టర్లు మారుతుంటాయి. అర్థం చేసుకోండి అన్నారు. చాలా నిరాశచెందాను. నేను చేయాలనుకుంది ఇది కాదు కదా అనిపించి బయటకు వచ్చేశాను.

నా సీన్లు లేపేయమన్నా నా సీన్లు తీసేయమన్నాను. ఎందుకంటే డబ్బు కోసం సినిమా చేయట్లేదు, వెండితెరపై నా ఎంట్రీ బాగుండాలని చేశానంతే! నా క్యారెక్టర్‌ను తీసేసి వేరే పాత్రను హైలైట్‌ చేసుకోండి అని చెప్పాను. అయినప్పటికీ సినిమాలో నా రోల్‌ అలాగే ఉంచారు. ఆ సినిమా ఇంపాక్ట్‌ నా కెరీర్‌పై ప్రభావం చూపించింది. ఆ మూవీ రిలీజయ్యాక చాలామంది అలాంటి రోల్‌ చేశావేంటి? అని అడిగారు. అప్పుడే మంచి సినిమాలు చేయాలని డిసైడయ్యాను.

కెరీర్ పై ప్రభావం

రంగస్థలం రిజెక్ట్‌ చేశా.. రంగస్థలం మూవీలోనూ ఆఫర్‌ వచ్చింది. కానీ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ సినిమా దెబ్బతో మళ్లీ నా పాత్రను ఎటు తిప్పుతారో ఏంటోనని భయపడి వెనకడుగు వేశాను. ఆ తర్వాత హీరో ఆదిగారిని సంప్రదించారని తెలిసింది. ఆయన కూడా ఒప్పుకోలేదు. కొద్దిరోజులకు ఇద్దరం ఒకేసారి ఒప్పుకున్నాం. అప్పటికే ఆది.. సుకుమార్‌కు ఫోన్‌ చేసి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో తనను సెలక్ట్‌ చేశారు అని చెప్పుకొచ్చాడు.

మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా అనుభవం ఆయనకు కఠిన పాఠం నేర్పింది. రంగస్థలం వంటి సినిమాలను తిరస్కరించడం వల్ల కలిగే నష్టాన్ని గుర్తించి, మంచి సినిమాలు ఎంచుకోవడంపై దృష్టి పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.